Thursday, January 23, 2025

పురపాలకశాఖ దశాబ్ది నివేదికను విడుదల చేసిన కెటిఆర్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పురపాలక శాఖ దశాబ్ది నివేదికను రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. “రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అయ్యింది. ఈ పదేళ్లలో గణనీయమైన గుణాత్మకమైన తేడాి కనిపిస్తుంది. ప్రతిఏటా జూన్ లో వార్షిక ప్రగతి నివేదికను విడుదల చేస్తున్నాం. పౌరులు కేంద్రంగా సంస్కరణలు తెస్తున్నాం. ఈసారి పురపాలక శాఖ దశాబ్ది నివేదికను విడుదల చేశాం. ఇది చాలా సమగ్రమైన నివేదిక. కేంద్ర ప్రభుత్వం కూడా 26 అవార్డులు ఇచ్చి గుర్తించింది. కొత్త పురపాలక చట్టం తెచ్చిన సిఎం కెసిఆర్ దే. తొమ్మిదేళ్లో పురపాలక శాఖ ద్వారా రూ.1.21 లక్షల కోట్లు ఖర్చు చేశాం. ఈ పదేళ్లలో 462శాతం ఎక్కువ ఖర్చు చేశాం. ఈ పదేళ్లలో చట్టబద్దంగా రావాల్సింది తప్ప కేంద్ర రూపాయి కూడా అదనంగా ఇవ్వలేదు. ఏ రంగం తీసుకున్నా గతంలో కంటే అనేక రెట్లు  ఎక్కువ ఖర్చు చేశాం” అని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News