Tuesday, November 5, 2024

వారికి ఛార్జీలు తగ్గించండి.. రైల్వే మంత్రికి కెటిఆర్ రిక్వెస్ట్

- Advertisement -
- Advertisement -

KTR Request to Railway Minister over rail charges

హైదరాబాద్ : వయోవృద్ధులు సహా పలు రకాల వారికి ఇచ్చే రాయితీలను రైల్వే శాఖ రద్దుపై రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ స్పందించారు. ఓ వార్తా సంస్థ చేసిన ట్వీట్‌ను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ట్యాగ్ చేశారు. రైల్వే మంత్రి గారూ.. ఇది చాలా దురదృష్టకరమని కెటిఆర్ పేర్కొన్నారు. కోట్లాది మంది సీనియర్ సిటిజన్స్‌కు మన సహాయం సహకారాలు అవసరం. వారిని గౌరవించుకోవాలి, సీనియర్ సిటిజన్స్‌కు రైళ్ల ఛార్జీల్లో రాయితీ కల్పించే అంశంపై సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని కెటిఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు. కరోనా కారణంగా వయోవృద్ధులు సహా పలు రకాల వారికి ఇచ్చే రాయితీలను రైల్వే శాఖ రద్దు చేసిన సంగతి విదితమే. సీనియర్ సిటిజన్ ప్రయాణీకుల ఛార్జీలకు వర్తింపజేసే రాయితీలను మార్చి, 2020 నుంచి రద్దు చేశారు. ఈ క్రమంలో సీనియర్ సిటిజన్స్ అందరూ పూర్తి ఛార్జీలు చెల్లించి రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 4 కోట్ల మంది సీనియర్ సిటిజన్స్ పూర్తి ఛార్జీలు చెల్లించి ప్రయాణించినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా తెలిసిందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News