Sunday, December 22, 2024

ఆ ఇద్దరు రైతులను కలుస్తా: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  ఓ రైతు భావోద్వేగమైన వీడియోపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సోషల్ మీడియాలో స్పందించారు. రైతు ఆర్తనాదాలు తన హృదయాన్ని కదిలించాయని, తాను త్వరలోనే ఆ రైతును కలుస్తానని వివరణ ఇచ్చారు. నల్లగొండ జిల్లా ముషంపల్లిలో గ్రామంలో మల్లయ్య అనే రైతు ఉన్నాడు. నీళ్లు లేవు వ్యవసాయం లేదు.. చావాలని అనిపిస్తుంది కెసిఆర్ అని వీడియో తీసి సదరు రైతు సోషల్ మీడియాలో పోస్టు చేయించాడు. ఆ వీడియోను కొందరు నెటిజన్లు కెటిఆర్‌కు ట్యాగ్ చేయడంతో ఆయన స్పందించారు. ఆ గ్రామంలో మల్లయ్యతో పాటు రైతు బోర్‌వెల్ రాంరెడ్డిని కూడా వ్యక్తిగతంగా కలుస్తానని కెటిఆర్ ట్వీట్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News