Wednesday, January 8, 2025

మాకే కాదు.. కాంగ్రెస్, బిజెపిలకూ ఇచ్చింది

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఫార్ములా ఈ-రేసు కేసు ప్రకంపనలు సృ ష్టిస్తున్న నేపథ్యంలో గ్రీన్‌కో ఎలక్టోరల్ బాండ్లు అంశం మరింత కాక పు టిస్తున్నది. బిఆర్‌ఎస్‌కు దశల వారీగా రూ.49 కోట్ల మొత్తాన్ని గ్రీన్ కో ఎలక్టోరల్ బాండ్లు రూపంలో ఇచ్చిందని కాంగ్రెస్ తాజాగా ఆరోపణలు చేసింది. దీనిపై మీడియా చిట్‌చాట్‌లో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ స్పందించారు. గ్రీన్ కో ఎలక్టోరల్ బాండ్లు కాంగ్రెస్, బీజేపీలకు కూ డా ఇచ్చిందని అన్నారు. గ్రీన్ కో ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చింది 2022 లో నని, ఫార్ములా – ఈ రేసు జరిగింది 2023లో అని కెటిఆర్ వివరించారు. రేసు కారణంగా నష్టపోయింది గ్రీన్ కో అని పేర్కొన్నారు. స్వయంగా పార్లమెంట్ ఆమోదించిన ఎలక్టోరల్ బాండ్లు ఇవ్వడం అవినీతి ఎలా అవుతుందని కెటిఆర్ ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా అన్ని పార్టీలకు వచ్చిన ఎలక్టోరల్ బాండ్లపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఈ ఫార్ములా రేసు నిర్వహించిన గ్రీన్ కో కంపెనీ ద్వారా బీఆర్‌ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో 41 సారు రూ.49 కోట్లు చెల్లింపు జరిగాయని సీఎం రేవంత్ రెడ్డి పీఆర్వో బోరెడ్డి అయోధ్య రెడ్డి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. రేసుకు సంబంధించిన చర్చలు మొదలయినప్పటి నుండే ఎన్నికల బాండ్లను గ్రీన్ కో సంస్థ కొనుగోలు చేసిందని ఆ ట్వీట్‌లో పేర్కొనడం సంచలనంగా మారింది.

కాగా రాష్ట్రంలో రైతాంగానికి ఇచ్చిన హామీల అమల్లో విఫలమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల దృష్టి మళ్లించేందుకే ఏసీబీ విచారణ డ్రామా- ఆడుతోందని కెటిఆర్ ఆరోపించారు. హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసిన కేసులో విచారణకు పిలవడం అంటే భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని విమర్శించారు. సాధారణ పౌరునిగా తనకు ఉండాల్సిన హక్కులను కూడా హరిస్తూ రేవంత్ రెడ్డి తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏసిబి విచారణ పేరుతో తనను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలనేదే ముఖ్యమంత్రి రేవంత్ రెడి లక్ష్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్ములా ఈ-రేసు కేసులో సోమవారం ఏసిబి కార్యాలయానికి వచ్చిన కెటిఆర్ తిరిగి వెళ్లిన తర్వాత ఆయన మీడియాతో చిట్‌చాట్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతులకు ఇవాల్సిన రైతు భరోసా ఇవ్వకుండా, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తప్పించుకునేందుకు ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఏసిబి విచారణ పేరుతో డ్రామా నడుపుతున్నారని విమర్శించారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే ఈ డ్రామా అంతా జరుగుతోందని ఆరోపించారు. తాను లాయర్లను తెచ్చుకుంటే వాళ్లకు ఎందుకు అంత భయమని ప్రశ్నించారు.

తన వెంట లాయర్లే లేకపోతే తాను ఇవ్వని స్టేట్‌మెంట్‌ను ఇచ్చినట్లుగా లీకులిస్తారని సంచలన ఆరోపణలు చేశారు. పోలీసులపై తనకు నమ్మకం లేదని, అందుకే తన వెంట విచారణకు లాయర్లను అనుతించాలని ఏసీబీ అధికారులను కోరానని కేటీఆర్ అన్నారు. తనతో పాటు లాయర్లను అనుమతిస్తేనే విచారణకు హాజరు అవుతానని ఏసీబీ అడిషనల్ ఎస్పీకి వివరణ ఇచ్చానని కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం తన క్వాష్ పిటిషన్ హైకోర్టులో ఉందని, అక్కడ తీర్పు వెలువడే వరకు తనను విచారించడం చట్టవిరుద్దమని అన్నారు. హైకోర్టు తీర్పు వచ్చేంత వరకు ఈ కేసు విచారణ ఆపాలంటూ కేటీఆర్ కోరారు. అయినా తాను విచారణకు సహకరించి వచ్చానని, తన వెంట న్యాయవాదులను తెచ్చుకోవద్దని చెబితే తాను విచారణకు హాజరయ్యేది లేదని తేల్చి చెప్పి తాను ఇవ్వదలచుకున్న వివరణ లేఖ రూపంలో అందించి తిరిగి వచ్చేశానని అన్నారు. న్యాయవాదులు లేకుండా వెళితే ఏం జరుగుతుందో తనకు తెలుసునన్న ఆయన ఇటీవల పట్నం నరేందర్ రెడ్డి కేసు విచారణ సందర్భంగా తప్పుడు స్టేట్‌మెంట్లు ఇచ్చిన పోలీసులపై నమ్మకం లేదని అన్నారు. అందువల్లే తాను లాయర్లతో కలిసి ఏసీబీ విచారణకు వచ్చానని అన్నారు. తనను విచారణకు పిలిచి తన ఇంటిపై దాడి చేయాలనే ప్రణాళికలో ప్రభుత్వం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తన ఇంట్లో వాళ్లే ఏదో ఒకటి పెట్టి కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తన ఇంట్లో చట్ట వ్యతిరేకమైన వస్తువులను ఉంచేందుకు కుట్ర కూడా జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలు ఎండగుతున్న తమను అపేందుకు, రైతు భరోసాపై చేసిన దగాకోరు మోసాన్ని కప్పిపుచ్చడానికే ఏసీబీతో తనను వేధించేందుకు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా రైతుల తరఫున తమ పోరాటం ఆగదని, కేసుల విషయం న్యాయపరంగా ఎదుర్కొంటానని కెటిఆర్ స్పష్టం చేశారు. ఎన్ని దాడులు చేసినా ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసిన ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై పోరాటం ఆపేది లేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను అమలు చేసేదాకా వదిలిపెట్టేది లేదని కూడా ఆయన హెచ్చరించారు. గ్రీన్ కో ఎలక్టోరల్ బాండ్లు మాకే కాదు, కాంగ్రెస్, బీజేపీకి కూడా ఇచ్చింది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News