Thursday, December 26, 2024

అభివృధ్ధి, సంక్షేమంలో దేశానికే తలమానికంగా సిరిసిల్ల జిల్లా: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న వెంటనే దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృధ్ధి సంక్షేమ పథకాలు ప్రారంభించామని ఐటి, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. మంగళవారం సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి కెటిఆర్ పలు అభివృధ్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైశాల్యంలో చిన్నదైన సిరిసిల్ల జిల్లా అన్ని జిల్లాల కంటే మిన్నగా విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీరు, త్రాగునీరు, విద్యుత్, సంక్షేమ రంగాలలో దేశానికే తలమానికంగా నిలుస్తోందని అన్నారు. ఆయా రంగాలలో సిరిసిల్ల సాధించిన ప్రగతి నివేదికలను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సిద్దం చేసి రాబోయే మాసాంతంలోగా ఒక్కో రంగానికి జిల్లాలో ఎంపిక చేసిన మండలంలో ప్రత్యేకంగా వేలాదిమందితో సమావేశాలు నిర్వహించి ప్రతి వ్యక్తికి ప్రగతి నివేదికలు అందిస్తామన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ప్రభుత్వం చిత్తశుధ్ధితో కృషి చేస్తోందని అందులో భాగంగానే రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణలో కేవలం 200 గురుకుల పాఠశాలలుంటే ప్రస్తుతం 1000కి పైగా ఏర్పాటు చేసిన ఘనత సిఎం కెసిఆర్‌కు దక్కుతుందన్నారు.

సిఎం కెసిఆర్ ఆశీస్సులతో సిరిసిల్ల జిల్లా ఎడ్యుకేషన్ హబ్‌గా మారిందన్నారు.జిల్లాలో మెడికల్ కళశాల, ఇంజనీరింగ్ కళాశాల, మంజూరయ్యాయని, వ్యవసాయ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల సహ అనేక కళాశాలలు ఏర్పాటు చేశామన్నారు. విద్యా ప్రమాణాలు పెంచేదిశగా పనిచేస్తున్నామన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు.
సంక్రాంతి నాటికి ఇండ్లు లేనివారి జాబితాలను సిద్దం చేసి అర్హులందరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లేదా వ్యక్తిగత ఇండ్లు మంజూరు చేసి జిల్లాలో ఇండ్లులేనివారు ఉండకుండా చూస్తామని అన్నారు. ఈ సందర్భంగా మన ఊరు మన బడి పనుల పురోగతిపై సమీక్షించారు. సంక్రాంతికల్లా పాఠశాలల్లో పనులు పూర్తి చేయాలన్నారు.

KTR Review on development works at Sircilla Collectorate

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News