హైదరాబాద్: జగిత్యాల, రాయికల్ మునిసిపల్ ఏర్పడి 2 ఏళ్ళు గడిచిన సందర్బంగా రెండేళ్లలో సాధించిన అభివృద్ధి పనులపై మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై మంత్రి సుదీర్ఘంగా చర్చించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అందులో భాగంగా మిషన్ భగీరథ పనులతో ధ్వంసమైన రహదారి సీసీ మరమ్మత్తులకు అదనపు నిధుల మంజూరు చేయాలని, 10కిమీ అదనంగా మిషన్ భగీరథ పైప్ లైన్ పనులకు నిధుల మంజూరు గురించి కోరగా సానుకూలంగా స్పందించారు. టియుఎఫ్ఐడిసి నిధులు జగిత్యాల పట్టణానికి రూ.18కోట్లు, రాయికల్ రూ.12కోట్ల మిగులు నిధుల పనులకు అనుమతి ఇచ్చారు. జగిత్యాల, రాయికల్ పురపాలక కార్యాలయాల నూతన భవన నిర్మాణానికి అనుమతుల సైతం మంజూరు చేశారు. నూకపల్లిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 4520 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు రోడ్లు, లైట్స్, వాటర్ సప్లయ్ వంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధుల కేటాయింపుపై సుముఖత వ్యక్తం చేశారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ 2 ఎకరాల స్థలంలో బీట్ బజార్ లో ఏర్పాటుపై అంగీకారం తెలిపారు. జగిత్యాల పట్టణ మాస్టర్ ప్లాన్ ను మార్చి చివరిలోపు పూర్తిగా రివిజన్ చేయాలని అధికారులను ఆదేశించారు. జగిత్యాల, రాయికల్ పట్టణంలో మొక్కల పెంపకం, పట్టణ సుందరీకరణపై అధిక దృష్టి పెట్టాలని సూచించారు. అనంతరం జగిత్యాల, రాయికల్ పురపాలక సంఘం భాద్యతలు చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అభివృద్ధి పనులపై కెటిఆర్ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీ ఎల్. రమణ, సిడిఎంఎ సత్యనారాయణ జిల్లా కలెక్టర్ జి. రవి, మున్సిపల్ చైర్మన్ లు భోగ శ్రావణి ప్రవీణ్, మోర హన్మాండ్లు, ఈఎన్ సి శ్రీధర్, వైస్ చైర్మన్ లు గోలి శ్రీనివాస్, గండ్ర రమాదేవి, మున్సిపల్ కమిషనర్ లు స్వరూప రాణి, శ్రీనివాస్ గౌడ్, ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
KTR Review on Jagtial and Raikal development works