Sunday, December 22, 2024

టిఆర్ఎస్ ఆవిర్భావ సభ ఏర్పాట్లను పరిశీలించిన కెటిఆర్

- Advertisement -
- Advertisement -

KTR reviewed arrangements for TRS Emergence Ceremony

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 27న మాదాపూర్ హైటెక్స్ లో ప్లీనరీ నిర్వహించనున్న నేపథ్యంలో ప్లీనరీ స్థలాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్బంగా మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని టీఆర్ఎస్ శ్రేణులు పండుగగా జరుపుకుంటారు. టిఆర్ఎస్ ఏర్పడి 21 ఏళ్లు పూరైనందున హెచ్ఐసీసీలో ప్రతినిధుల మహాసభను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. రాష్ట్ర ప్రతినిధులకు ఆహ్వానాలు పంపుతున్నాం. ఆవిర్భావ దినోత్సవానికి 3వేల మంది హాజరవుతారని వెల్లడించారు. రేపు మధ్యాహ్నం జిహెచ్ఎంసి నాయకులతో కెటిఆర్ భేటీ కానున్నారు. ఆహ్వానాలు అందినవారే ఆవిర్భావ సభకు రావాలని మంత్రి కోరారు. సభకు వచ్చేవారికి పాసులు జారీ చేస్తామన్నారు. గ్రామశాఖల అధ్యక్షులు టిఆర్ఎస్ జెండాలు ఆవిష్కరించాలని కెటిఆర్ ఆదేశించారు. 12769 గ్రామ శాఖల అధ్యక్షులు వారి వారి గ్రామాల్లో టీఆర్ఎస్ జెండాలు ఆవిష్కరించాలి. 3,600 చోట్ల పట్టణాల్లో జెండా ఆవిష్కరణ చేయాలన్నారు. తెలంగాణ ఆత్మగౌరవానికి, అస్థితత్వానికి ప్రతీకగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News