Thursday, December 19, 2024

డబ్బు మదంతో కోమటిరెడ్డి బ్రదర్స్ మాట్లాడుతున్నారు: కేటీఆర్

- Advertisement -
- Advertisement -

నల్గొండ: కోమటిరెడ్డి బ్రదర్స్ డబ్బు మదంతో మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో మంగళవారం జిల్లాలోని నకిరేకల్ నియోజకవర్గం చిట్యాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య తరుపున మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థిరపాలన లేకపోతే రాష్ట్రం ఆగమైతదన్నారు. బీఆర్ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ పేర్లు మార్చి కాపీకొట్టి మేనిఫెస్టోలో పెట్టిందని అన్నారు.

డబ్బు మదంతో కోమటిరెడ్డి బ్రదర్స్ మాట్లాడుతున్నారని.. వాళ్ళకు ఓటమి తప్పదని కేటీఆర్ అన్నారు. పోటీ చేయని జానారెడ్డి కూడా సీఎం అవుతా అంటున్నాడని ఎద్దేవా చేశారు. కర్నాటక నుంచి కాంగ్రెస్ కు డబ్బులు వస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నాణ్యతలేని కరెంటు, కాలిపోయే మోటర్లు, ఎరువుల కొరత, విత్తనాల కొరత తప్పదని అన్నారు. తెలంగాణ ప్రజలే మాకు ధైర్యమని.. నకిరేకల్ లో చిరుమర్తి లింగయ్య గెలుపు ఖాయం కేటీఆర్ జోష్యం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News