Wednesday, January 22, 2025

కేసీఆర్ గెలిస్తే.. కామారెడ్డి పూర్తిగా మారిపోతుంది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

కేసీఆర్ రాకతో కామారెడ్డి పూర్తిగా మారిపోతుందని మంత్రి కెటిఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కామారెడ్డిలో మంత్రి కెటిఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. కామారెడ్డి అభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు. తెలంగాణను తెచ్చిన కేసీఆర్ కు లోకల్, నాన్ లోకల్ అని ఉంటుందా? అని అన్నారు. తొమ్మిదిన్నరేళ్లలో దేశానికి, రాష్ట్రానికి మోదీ చేసింది శూన్యమని.. కాంగ్రెస్ వస్తే గోసపడతమని అన్నారు.

తెలంగాణ మినహా.. ఏ రాష్ట్రంలోనూ బీడి కార్మికులకు పింఛన్లు ఇస్తలేరని.. రాష్ట్రంలో 4.5లక్షల మంది బిడి కార్మికులకు పింఛన్లు ఇస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే.. బిడి కార్మికుల పింఛనుకు కటాఫ్ డేట్ తొలగిస్తామన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్లను దశలవారిగా రూ.5వేలకు పెంచుతామని.. కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.5లక్షల బీమా కల్పిస్తామని కెటిఆర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News