Sunday, December 22, 2024

కళ్ల ముందు కనిపిస్తున్న నిజం నమ్మాలి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

పంటలు ఎండితే కొనే అవసరం లేదు.. బోనస్ ఇవ్వాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ ఆలోచిస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కెటిఆర్ అన్నారు. రైతులు పండించిన ధాన్యం క్వింటాలుకు రూ.500 బోనస్… నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ రైతుదీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. రైతుల కోసం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ రైతు దీక్షలో పాల్గొన్నారు. కెసిఆర్ అవినీతి చేశారని చదువురాని వాడు కూడా యూట్యూబ్ లో వీడియోలు చేస్తున్నారు. యూబ్యూబ్  వీడియోలు కాదు కళ్ల ముందు కనిపిస్తున్న నిజం నమ్మాలని కెటిఆర్ సూచించారు. నేరవేర్చలేని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కెటిఆర్ ఆరోపించారు. రైతుల రుణమాఫీ గురించి అడిగితే సీరియస్ గా తీసుకోవద్దని సిఎం అంటున్నారని కెటిఆర్ మండిపడ్డారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News