Monday, January 20, 2025

సిఎం కెసిఆర్ నిర్ణయాలు సంచలనం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కామారెడ్డి డిగ్రీ కళాశాల మైదానంలో స్టేడియం నిర్మాణానికి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ… కామారెడ్డి నియోజకవర్గం ఉద్యమ స్పూర్తిని తెచ్చిందన్నారు. కామారెడ్డి నియోజకవర్గం గురించి రాష్ట్రమంతా చర్చ జరుగుతోందని మంత్రి వెల్లడించారు. కెసిఆర్ కామారెడ్డి నియోజకవర్గాన్ని ఎందుకు ఎంచుకున్నారని చర్చ జరుగుతోందని ఆయన తెలిపారు.

పొత్తులో భాగంగా 2004 లో కామారెడ్డి నియోజకవర్గాన్ని తీసుకున్నాం. గంపా గోవర్ధన్ పార్టీలోకి రావడంతో కామారెడ్డిలో బిఆర్ఎస్ బలం పెరిగిందని కెటిఆర్ స్పష్టం చేశారు. కామారెడ్డిలో కెసిఆర్ పటీ చేయాలని గోవర్ధన్ అడుగుతారని నేను అనుకోలేదు అని ఆయన తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గం నంబర్ వన్ ఉండాలనే కెసిఆర్ పోటీ చేయాలని అడిగారు. కెసిఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా బలమైన ఆశయం.. ధృడమైన సంకల్పం ఉంటుందన్నారు. కెసిఆర్ నిర్ణయాలు సంచలనంగా ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News