- Advertisement -
భారతీయ జనతా పార్టీని ఆపగలిగే శక్తి బలమైన ప్రాంతీయ పార్టీలకే ఉందని బిఆర్ఎస్ మాజీ మంత్రి కెటిఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే వారణాసిలో పోటీ చేసి గెలవాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పై మమతా బెనర్జీ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్ ఉన్న 40 స్థానాలను నిలబెట్టుకోలేదన్నారు. బిజెపిను వదిలి ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ పోటీ పడుతుందని చెప్పారు. కాంగ్రెస్ వ్యవహార శైలి వల్లే ఇండియా కూటమి ముక్కలైందన్నారు. కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ బిజెపితో నేరుగా పోటీ పడాలన్న కెటిఆర్ ఇండియా కూటమిలోని పార్టీల గెలుపు అవకాశాలను కాంగ్రెస్ దెబ్బతీస్తోందని మండిపడ్డారు. బిజెపికి కాంగ్రెస్ ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదని కెటిఆర్ స్పష్టం చేశారు.
- Advertisement -