Thursday, January 23, 2025

కెటిఆర్‌పై సంచలన ఆరోపణలు.. తీవ్రంగా స్పందించిన మంత్రి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సుఖేష్ అనే వ్యక్తి గురించి తానెప్పుడూ వినలేదని, అతనెవరో తనకు తెలియదని రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. సుకేష్ ఆరోపణలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో తీవ్రంగా స్పందించారు. అతడి మాటలపై న్యాయ పరంగా చర్యలు తీసుకుంటానని కెటిఆర్ వెల్లడించారు. నేరస్థుడు, మోసగాడు సుఖేష్ తనపై చేసిన నిరాధార ఆరోపణలు మీడియా ద్వారానే తన దృష్టికి వచ్చాయన్నారు. సుకేష్ అనే పోకిరీ అభ్యంతరకర మాటలపై కఠిన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు. సుకేష్ లాంటి మోసగాడు చేసిన వ్యాఖ్యలను ప్రసారం చేసే ముందు లేదా ప్రచురించే ముందు జాగ్రత్తగా ఆలోచించాలని మీడియాను మంత్రి కెటిఆర్ అభ్యర్థించారు. మనీలాండరింగ్ కేసులో 2 వేల కోట్ల లావాదేవీలపై సుకేష్‌ సంచలన ఆరోపణలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News