హైదరాబాద్:తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే టిఆర్‌ఎస్, బిజెపి నేతల మధ్య మాటల యుద్ధం మొదలయింది. ఇప్పటికే పలు సందర్భాల్లో రెండు పార్టీల నేతలు ఒకరిపైమరొకరు తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు. తాజాగా మరోసారి బిజెపి నేతలపై మంత్రి కెటిఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర నేటితో ముగియనుంది. ఈ క్రమంలో వరంగల్‌లోని ఆర్ట్స్ కాలేజీలో బిజెపి బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, కేంద్ర మంత్రులు రానున్నారు. ఈ నేపథ్యంలో కెటిఆర్ ట్విట్టర్ వేదికగా బిజెపి నేతలపై సెటైరికల్ కామెంట్స్ చేశారు. ‘‘ఈరోజు జెపి నడ్డా చప్పులను ఏ గులాం మోస్తారు?. కచ్చితంగా తీవ్రమైన పోటీ ఉంటుందని నేను అనుకుంటున్నా’’ అంటూ కామెంట్స్ చేశారు.
మునుగోడులో జరిగిన బిజెపి సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరైన విషయం తెలిసిందే. అమిత్ షా పర్యటనలో భాగంగా బండి సంజయ్ ఆయన చెప్పులు మోసిన ఘటన తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఈ ఘటనపై ప్రతిపక్ష నేతలు బండి సంజయ్ తీరుపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాలను తాకట్టు పెట్టారని షాకింగ్ కామెంట్స్ చేశారన్నది ఇక్కడ గమనార్హం.
Pop quiz:
Which Ghulam will carry the Chappal of JP Nadda today?
Am sure there is intense competition 😁 pic.twitter.com/Tz8YiCYIiS
— KTR (@KTRTRS) August 27, 2022