Monday, December 23, 2024

అమిత్ షాపై కెటిఆర్ వ్యంగ్యాస్త్రం

- Advertisement -
- Advertisement -

మెరిట్ ఆధారంగా బిసిసిఐ
సెక్రెటరీగా ఎదిగిన ఓ కుమారుడి
తండ్రి రాష్ట్ర పర్యటనకు వచ్చారు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర పర్యటనకు వచ్చిన బిజెపి అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ ఆదివారం వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కుటుంబ పాలనపై అమిత్ షా మాట్లాడ టం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. పూర్తిగా మెరిట్ ఆధారంగా ర్యాంకులను సాధించి బిసిసిఐ సెక్రటరీగా ఎదిగిన ఓ కుమారుడి తండ్రి రాష్ట్ర పర్యటనకు వచ్చారంటూ అమిత్‌షాపై కెటిఆర్ సెటైర్లు సంధించారు. అంతటితోఆగని కెటిఆర్.. కాంగ్రెస్ పార్టీని వీడి బిజెపిలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపైనా సెటైర్లు గుప్పించారు. రాజగోపాల్‌రెడ్డిని సౌమ్యుడం టూ ఎద్దేవా చేశారు. సౌమ్యుడైన నేత కోసం ప్రచారం చేసేందుకు అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వచ్చారని చలోక్తి సంధించారు. అన్న ఎంపిగా ఉండగా, భార్య ఎంఎల్‌సిగా పోటీ చేసిన వ్యక్తి తరపున అమిత్ షా ప్రచారం చేస్తున్నారన్నారు. అలాంటి తండ్రి.. కుటుంబ పాలన రద్దు చేయాల్సిన అవసరంపై మనకు హితబోధ చేస్తున్నారంటూ కెటిఆర్ ఎద్దేవా చేశారు.

ఆ విషయంలో మీ వైఖరేమిటో చెప్పండి…

వరుస ట్వీట్లు చేసిన ఆయన బిజెపి తీరును తూర్పారబట్టారు. అమిత్ షాజీ బిల్కిస్ బానో రేపిస్టుల విషయంలో తన వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. రేపిస్టుల విషయంలో కఠినంగా ఉంటామంటూ ఎర్రకోట నుంచి ప్రధాని మోడీ ఇచ్చిన సందేశాన్ని గుజరాత్ ప్రభుత్వం లైట్ తీసుకుందా? అంటూ మంత్రి కెటిఆర్ సెటైర్లు వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News