Monday, December 23, 2024

అమిత్ షా గారు.. మీకు అధికారం కాదు.. అంధకారమే!

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : త్వరలో బిజెపి అధికారంలోకి కాదు..బిజెపి అంధకారంలోకే…అంటూ బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. త్వరలో రాష్ట్రంలో బిజెపి ఖాళీ… ఢిల్లీలో ప్రధాని కుర్చీ ఖాళీ..2024లో..వైఫల్యాల మోదీకి..గుజరాత్ ఘర్ వాపసీ తప్పదు…మరోసారి మోదీని ప్రధాని పీఠం ఎక్కిస్తే..దేశాన్ని బలిపీఠం ఎక్కించినట్టే అనే బలమైన భావనలో ప్రజలు ఉన్నారంటూ కెటిఆర్ ట్వీట్ చేశారు. బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.టి. రామారావు కేంద్రమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు. కారు స్టీరింగ్ కాదు…బిజెపి స్టీరింగే ఆదానీ చేతికి చిక్కింది….కార్పోరేట్ దోస్తు కబంధ హస్తాల్లో కమలం.. విలవిలలాడుతోంది…హిండెన్ బర్గ్ రిపోర్ట్‌తో బిజెపి ఫుల్ పిక్చర్‌ను…దేశప్రజలు 70 ఎంఎంలో చూసేశారు…ఇంకా ఏ ట్రయిలర్ అవసరం లేదని పేర్కొన్నారు. తెలంగాణలో గల్లీ బిజెపి నేతల పగటి వేషాలు నడవవు….ఢిల్లీ పెద్దల పగటి కలలు నెరవేరవు….ఆదానీపై జెపిసి వేయని బిజెపికి..సిట్టింగ్ జడ్జి విచారణ అడిగే హక్కు ఉందా..? అని సూటిగా ప్రశ్నించారు.

మోసాల మోడీని తెలంగాణ నమ్మదు

ముక్కునేలకు రాసినా…మోకాళ్ల యాత్ర చేసినా…మోసాల మోదీని తెలంగాణ నమ్మదని కెటిఆర్ విమర్శించారు. బట్టేబాజ్ బిజెపిని తెలంగాణ సమాజం క్షమించదని పేర్కొన్నారు. కరప్షన్‌కు కెప్టెన్… మోదీ క్యాప్షన్…బిజెపి…ఎంఐఎం భుజంపై తుప్పుపట్టిన బిజెపి తుపాకీపెట్టి ఎంతకాలం కాలుస్తారు…తెలంగాణలో సొంత బలం లేని పార్టీ బిజెపి…పల్లెపల్లెనా బలగం కలిగిన పార్టీ బిఆర్‌ఎస్.

కేంద్ర నిధులు దుర్వినియోగమా ..?
బారాణా తీసుకుని చారాణా కూడా ఇవ్వని బిజెపికి మిగిలేది బూడిదే….అదానీ విషయంలో జెపిసి కాదు కదా కనీసం సిట్ కూడా వేయని వారు అవినీతి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది….గుజరాత్‌లో మోడీ హయాంలో మీరు హోం మంత్రిగా ఉన్నప్పుడు పేపర్ లీకులలో గుజరాత్ నెంబర్‌వన్‌గా ఉన్నమాట నిజం కాదా..? అని ప్రశ్నించారు. గత ఎనిమిది ఏళ్లలో గుజరాత్‌లో 13 సార్లు పేపర్ లీక్స్ కాలేదా..? అని నిలదీశారు. ఈ దేశంలో వ్యాపం లాంటి అతి జుగుప్సాకరమైన స్కాం చేసింది మీ బిజెపి పార్టీ ప్రభుత్వం కాదా..? అటువంటి మీరు నిస్సిగ్గుగా సుద్దులు మాట్లాడం మీకే చెల్లింది. పిఎం కేర్స్‌లో ఎంత జమైంది…- ఏ విదంగా ఖర్చు అయ్యిందో చెప్పని వారు …కాగ్ ఆడిట్ పిఎం కేర్స్‌కు వర్తించదు అని నిస్సిగ్గుగా సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేసిన వారు…కాగ్ మాత్రమే కాక అన్ని రకాల బ్యాంక్స్ ఆడిట్‌లతో కట్టిన ప్రాజెక్ట్‌లపై మాట్లాడం.. అవివేకం కాక మరి ఏమిటి…? అని ప్రశ్నించారు. ఎనిమిది ఏళ్లుగా కృష్ణ నదిలో తెలంగాణ వాటా తేల్చకుండా, పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించకుండా ఇక్కడికి వచ్చి ఎవరో మీ గులాములు రాసిచ్చిన స్క్రిప్టును వల్లెవేస్తె నమ్మేదెవరు..? అని కెటిఆర్ అమిత్‌ను నిలదీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News