Monday, December 23, 2024

గుజరాతీ గులాములు

- Advertisement -
- Advertisement -

అమిత్‌షా చెప్పులు మోసిన బండిపై కెటిఆర్ వ్యంగ్యాస్త్రం

మన తెలంగాణ/హైదరాబాద్ : అమిత్‌షాకి బండి సంజ య్ చెప్పులు అందిస్తున్నట్లుగా ఉన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మునుగోడులో నిర్వహించిన ‘బిజెపి సమరభేరి’ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా తొలుత హైదరాబాద్ చేరుకున్న అమిత్‌షా సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం గుడి బయట బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అమిత్ షాకు చెప్పు లు అందిస్తున్నట్లుగా ఉన్న ఓ వీడియో సోమవారం నాడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ‘ఢిల్లీ చెప్పులను మోసే గుజరాతీ గులాములను.. ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకుణ్ణి తెలంగాణ గమనిస్తోంది. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పిగొట్టి, ఆత్మ గౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్గం సిద్ధ్దంగా ఉంది’ అని కెటిఆర్ వ్యాఖ్యానించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News