మన తెలంగాణ/హైదరాబాద్: టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా ప్రధానిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించలేని ప్రధానిని మీరేమంటారని ప్రశ్నించారు. అంతేకాకుండా దేశంలో చొరబాటును నియంత్రించలేకపోతున్న ఇలాంటి ప్రధానిని మీరేమని పిలుస్తారని నాలుగు ఆప్షన్లను (ఎ. 56”, బి. విశ్వగురు, సి. అచ్చేదిన్ వాలే, డి. పైన పేర్కొన్నవన్నీ అన్ పార్లమెంటరీ పదాలు కాబట్టి తొలగించబడ్డాయి) కెటిఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా రెండో గ్రామాన్ని నిర్మించిందని, శాటిలైట్ ఫోటోలతో సహా మీడియా ప్రచురించిన కథనాలను కెటిఆర్ ట్వీట్ చేశారు. అయితే 2021లో చైనా మరోసారి బరి తెగించిందని, విస్తరణవాదంతో చెలరేగుతున్న డ్రాగన్ దేశం.. మన భూభాగంలో ఓ గ్రామం నిర్మించిందని అప్పట్లో సంచలన కథనాన్ని ప్రచురించిన విషయం విదితమే. ప్రస్తుతం ఈ వార్త అప్పట్లో వైరల్ అయింది.
అరుణాచల్ ప్రదేశ్ వద్ద సరిహద్దుకు 4.5 కిలోమీటర్ల లోపల భారత్ భూభాగంలో ఈ నిర్మాణాలు చేపట్టినట్టు శాటిలైట్ చిత్రాల ఆధారంగా కథనాన్ని రాసింది. అయితే.. అరుణాచల్‌ప్రదేశ్‌లోని అప్పర్ సుబన్ సిరి జిల్లాలో గల వివాదాస్పద ప్రాంతంలో చైనా బలగాలు ఏకంగా 101 ఇళ్లు నిర్మించినట్లు ఆధారాలతో ఓ మీడియా ప్రచురించిన విషయం విదితమే. భారత్ భూభాగమైన ఈ ప్రాంతాన్ని చైనా అనేకమార్లు తమకు చెందినదేనంటూ ప్రకటించింది. గతంలో ఇక్కడ పలుమార్లు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. చైనా ఈ గ్రామం నిర్మించినట్లు శాటిలైట్ చిత్రాల ఆధారంగా నిపుణులు తెలిపిన విషయం తెలిసిందే. అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్‌లో చైనా నిర్మించిన రెండో గ్రామం, శాటిలైట్ ఇమేజ్‌స్‌కు సంబంధించి జాతీయ మీడియా ప్రచురించిన కథనాలు కూడా కెటిఆర్ ఈ సందర్భంగా తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం కెటిఆర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
KTR Cetaires on PM Modi by Twitter