Thursday, January 23, 2025

మోడీ సర్కార్‌పై కెటిఆర్ సెటైరికల్ ట్వీట్

- Advertisement -
- Advertisement -

 

KTR

హైదరాబాద్: మోడీ ప్రభుత్వంపై మంత్రి కెటిఆర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ‘‘మోడీ సర్కార్ ఎంతో ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉపన్యాసాలు ఇస్తున్నారు… కానీ అంకెలు చూస్తే వాస్తవాలు తెలుస్తాయి’’ అన్నారు. దేశానికి తెలంగాణ ఇచ్చే ప్రతీ రూపాయిలో కేవలం 46 పైసలు మాత్రమే తిరిగి ఇస్తున్నారని తెలిపారు. అన్ని బిజెపి పాలిత రాష్ట్రాలలో రేషన్ షాపుల వద్ద ఈ వాస్తవాలతో బ్యానర్‌లు పెట్టాలని నిర్మాలాసీతారామన్‌కు కెటిఆర్  చురకలంటించారు. ఈ ఏడు సంవత్సరాలలో కేంద్రానికి తెలంగాణ 3,65,797 కోట్ల రూపాయలు పన్ను చెల్లించిందని చెప్పారు. కానీ కేంద్రం తిరిగి తెలంగాణకు 1,68,647కోట్ల రూపాయలు మాత్రమే తిరిగి ఇచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రమే కేంద్రానికి 1,97,150కోట్లు అదనంగా ఇచ్చిందని చెప్పుకొచ్చారు. ఈ వాస్తవాలను రేషన్ షాపుల వద్ద బ్యానర్‌లు పెట్టించండి అంటూ నిర్మాలాసీతారామన్‌‌కు మంత్రి కెటిఆర్‌ ట్విట్టర్ వేదిక ద్వారా చురకలంటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News