Thursday, January 23, 2025

ప్రధాని మోడీపై కెటిఆర్ సెటైరికల్ ట్వీట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : విద్యార్హతల సర్టిఫికెట్లపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ శుక్రవారం సెటైరికల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో తాను పుణే విశ్వవిద్యాలయం నుండి బయో టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ, అదే విధంగా సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్ డిగ్రీని కలిగి ఉన్నట్లు ఆయన పేర్కొంటూ మరి.. మీ విద్యార్హతల సర్టిఫికెట్ల మాటేమిటి? అని ప్రశ్నిస్తూ సదరు ట్వీట్‌లో ప్రధాని మోడీపై వ్యంగోక్తులు విసిరారు.

పబ్లిక్ డొమైన్‌లో మీరు, నేను విద్యార్హతల సర్టిఫికెట్లను షేర్ చేద్దామంటూ ప్రధాని మోడీకి సదరు ట్వీట్టర్ ద్వారా మంత్రి కెటిఆర్ సవాల్ విసిరినట్లయింది. కేవలం చెప్పడం కాదు.. చేసి చూపించాలని సైతం ఆయన ప్రధాని మోడీనుద్దేశించి ఈ ట్వీట్ ద్వారా చెప్పకనే చెప్పినట్లయింది. నా విద్యార్హతలివే.. మరీ మీ విద్యార్హతల సంగతేంటి? అని సదరు ట్వీట్ ద్వారా గుర్తు చేశారనే చెప్పొచ్చు. మరి ఈ ట్వీట్‌లో చేసిన సవాల్‌పై ప్రధాని మోడీ ఏ విధంగా స్పందిస్తారో..చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News