Friday, March 21, 2025

తెలుగు రాజకీయాలలో బిఆర్ఎస్ ది సుదీర్ఘ చరిత్ర: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సీనియర్ నటుడు నందమూరి తారక రామారావు తర్వాత తెలుగువారి ఆత్మగౌరవం కోసం పోరాడింది తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆరే అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. తెలుగు రాజకీయాలలో బిఆర్ఎస్ ది సుదీర్ఘ చరిత్రని కెటిఆర్ కొనియాడారు. కెసిఆర్ అనే సునామి లేకపోతే తెలంగాణ రాష్ట్రమే ఉండేది కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టాలంటే బిఆర్ఎస్ తోనే సాధ్యమని తెలియజేశారు. ఏ యూట్యూబ్ ను అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చారో దానిపైనే కక్షగట్టారని విమర్శించారు. బడ్జెట్ లో అన్ని వర్గాల వారికి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోయింది అధికారమే, ప్రజల అభిమానం కాదని పేర్కొన్నారు. వరంగల్ లో జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కెటిఆర్ పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News