Saturday, November 23, 2024

పెట్టుబడిదారులను కంటికి రెప్పలా చూసుకుంటున్నాం

- Advertisement -
- Advertisement -

KTR Says Telangana always take care of investors

పిఎఎఫ్‌ఐ ఎనిమిదవ జాతీయ ఫోరం వర్చువల్ సద్సులో మంత్రి కెటిఆర్
 వారు పెట్టే ప్రతి రూపాయికి భద్రత ఇస్తున్నాం
 గడిచిన ఏడేళ్లలో రాష్ట్రానికి 32 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి
 అందులో 24 శాతం ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన వారి నుంచే రావడం విశేషం
 వర్చువల్ విధానం ద్వారా జరిగిన పిఎఎప్‌ఐ 8వ జాతీయ ఫోరం సదస్సుల్లో పేర్కొన్న మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న వారిని కంటికి రెప్పలా చూసుకుంటామని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. వారికి అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంటున్నదన్నారు. పెట్టబడుదారులు పెట్టే ప్రతి రూపాయికి రాష్ట్ర ప్రభుత్వం భద్రత ఇస్తు న్న కారణంగానే తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు పెద్దసంఖ్యలో ఔత్సాహికులు ముందుకు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కేవలం ఏడేళ్లలోనే సుమారు 32 మిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించామన్నారు. అందులో 24 శాతం ఇప్పటి కే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన వారి నుంచే రావడం అరుదై న విషయంగా ఆయన పేర్కొన్నారు. కొత్తగా పెట్టుబడి పెట్టే వారినే కాకుండా ఇప్పటికే పెట్టుబడి పెట్టిన వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. సాధారణంగా రాష్ట్రంలో ఒక్కసారి పెట్టుబడి పెట్టిన తరువాత సదరు కంపెనీలను రాష్ట్ర ప్రభుత్వాలు మరిచిపోతుంటాయన్నారు. కానీ తెలం గాణ ప్రభుత్వం అలా కాదన్నారు. కొత్త, పాత పారిశ్రామిక వే త్తలు అన్న తేడా లేకుండా రాష్ట్రంలో పెట్టుబడిగా పెట్టే ప్రతి రూపాయికి భరోసా ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్షమన్నారు.

శుక్రవారం పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా (పిఎఎఫ్ ఐ) ఆధ్వర్యంలో జరిగిన 8వ జాతీయ ఫోరం 2021లో వర్చువల్ విధానం ద్వారా మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెట్టుబడుదారులను విశేషంగా ఆకర్శిస్తున్న రాష్ట్రాల్లో ప్రస్తుతం తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. కేవలం ఏడేళ్లలోనే తెలంగాణ రాష్ట్రం సాధించిన పెట్టుబడులు దేశంలో మరే రాష్ట్రం సాధించలేదన్నారు. పెట్టుబడులను సులభతరం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, యువ ప్రొఫెషనల్స్‌ను రంగంలోకి దింపిదని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా టిఎస్…ఐపాస్‌ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి న విధానమే ఈ పురోగతికి ప్రధాన కారణమని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఈ పాలసీ ప్రకారం సెల్ఫ్ సర్టిఫికేషన్‌ను టిఎస్ ఐపాస్ విధానం అనుమతిస్తుందన్నారు. అలాగే 15 రోజుల గడువులోగా అన్ని రకాల అనుమతులకు క్లియరెన్స్ ఇస్తున్నామని చెప్పారు. ఒకవేళ గడువులోగా క్లియరెన్స్ లభించకపోతే, సదరు దరఖాస్తుకు ఆమోదం లభించినట్లేనని వివరించారు.

ఈ విధానం దేశంలో ఎక్కడా లేదన్నారు. వీరు రాష్ట్ర పాలసీలు, మౌలిక వసతులు వంటి వివరాలను పెట్టుబడి దారులకు వివరిస్తున్నారన్నారు. ఏడేళ్ల క్రితం రాష్ట్ర ఆవిర్భావం సమయంలో ఏర్పాటు చేసిన ‘ఇన్వెస్ట్ ఇండియా’ బ్యానర్‌పై ఈ యువకులు పనిచేస్తున్నారని కెటిఆర్ చెప్పారు. అదే సమయంలో మానవ వనరుల అభివృద్ధిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతోందన్నారు. ఇందు లో భాగంగా తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టిఎఎస్‌కె) కింద ప్రభుత్వమే నిధులు ఖర్చుపెట్టి యువకుల్లో నైపుణ్యాలను పెంచు తోందన్నారు. స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించిన సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఇన్సెంటివ్స్ కూడా ఇస్తున్నట్లు ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తు గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఐసిసిఐ సెక్రటరీ జనరల్ దిలీప్ చెనాయ్, ఐటి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News