- Advertisement -
కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ లీగల్ నోటీసులు పంపించారు. తన పరువుకు నష్టం కలిగించేలా బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారని, వారంలోగా క్షమాపణ చెప్పకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటానని హెచ్చరించారు. ఇటీవల గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు చేపట్టిన ఆందోళనకు మద్దతుగా ఆశోక్ నగర్ వెళ్లిన బండి సంజయ్.. అక్కడ కెటిఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తర్వాత పార్టీ ఆఫీసులోనూ కెటిఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి కొండ సురేఖ చేసిన కామెంట్స్ పై ఇప్పటికే కెటిఆర్ నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.
- Advertisement -