Monday, December 23, 2024

సుఖేష్‌కు కెటిఆర్ లీగల్ నోటీసు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ఢిల్లీ మ ద్యం కేసు నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్‌కు బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కెటిఆర్ తన న్యాయవాది ద్వారా లీ గల్ నోటీసులు పంపించారు. తనపై తప్పు డు విషయాలతో కేంద్రానికి, సిబిఐకి ఫిర్యా దు చేసిన సుఖేష్ చంద్రశేఖర్ తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని లీగల్ నోటీసులో పేర్కొన్నారు. నిరాధారమైన ఆరోపణలు చే స్తూ తనపై చేసిన ఫిర్యాదును భేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో తనపై తప్పుడు ప్రచారం చేయవద్దని స్పష్టం చేశారు. కెటిఆర్‌పై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, కల్పితమైనవి సుప్రీం కోర్టు న్యాయవాది కృష్ణదేవ్ జె లీగల్ నోటీసులో పేర్కొన్నారు. ఇది పూర్తిగా ఉద్దేశపూర్వకంగా చీప్ పబ్లిసిటీ కోసం లేదా ఇతర కారణాల వల్ల చేసినట్లుగా ఉందని తెలిపారు. అనేక క్రిమినల్ కేసులకు సంబంధించి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నప్పటికీ,

సుఖేష్ తన క్లయింట్ అయిన బాధ్యతగల ప్రజాప్రతినిధిపై నిరాధారమైన అబద్ధాలను ప్రచారం చేస్తూ సంచలనం చేయడం ద్వారా మీడియా దృష్టిని ఆకర్షించడానికి పోటీపడుతున్నట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు. తన క్లయింట్‌కు సుఖేష్‌తో ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ ఆయన చేసిన ఫిర్యాదులోని విషయాలు పూర్తిగా కల్పితమైనవిగా ఉన్నాయి తప్ప మరొకటి కాదని అన్నారు. ఈ ఆరోపణలు పరువు నష్టం కలిగించేవిగా, అవమానకరమైనవిగా ఉన్నాయని పేర్కొన్నారు. సుఖేష్ రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదును వెంటనే ఉపసంహరించుకోవాలని, తన క్లయింట్‌కు బేషరతుగా తక్షణమే క్షమాపణను చెప్పాలని లీగల్ నోటీసులో డిమాండ్ చేశారు. భవిష్యత్తులో తన క్లయింట్‌కి వ్యతిరేకంగా అలాంటి తప్పుడు ఆరోపణలతో ప్రకటనలు చేయకూడదని, సుఖేష్ ఫిర్యాదులో చేసిన నిరాధారమైన ఆరోపణలకు తన క్లయింట్ చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు కలిగి ఉన్నారని స్పష్టం చేశారు.

సుఖేష్ ఎవరో నాకు తెలియదు : ట్విట్టర్‌లో మంత్రి కెటిఆర్
ఓ నేరగాడు, మోసగాడు అయిన సుఖేష్ అనే వ్యక్తి తనపై మతిలేని ఆరోపణలు చేశాడని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే. సుఖేష్ ఆరోపణలు మీడియా ద్వారా తన దృష్టికి వచ్చాయని కెటిఆర్ పేర్కొన్నారు. సుఖేష్ ఎవరో తనకు తెలియదని మంత్రి స్పష్టం చేశారు. సుఖేష్ నిరాధార ఆరోపణలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని కెటిఆర్ స్పష్టం చేశారు. అయితే ఇలాంటి నిరాధారణ ఆరోపణలను ప్రచురించే ముందు మీడియా కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని కెటిఆర్ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News