Friday, December 20, 2024

పిచ్చోని లెక్క ఆ ఇద్దర్నీ నమ్మినా: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

ఇంటి దొంగలే బీఆర్ఎస్ కు వెన్నుపోటు పొడిచారని మాజీ మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పట్నం మహేందర్ రెడ్డికి పార్టీ తక్కువేం చేయలేదని, అయినా ఆయన పార్టీని విడిచి వెళ్లిపోవడం దారుణమని అన్నారు. తెలంగాణ భవన్ లో శుక్రవారం  చేవెళ్ల సెగ్మెంట్ పార్టీ నేతలతో ఆయన మాట్లాడుతూ రంజిత్ రెడ్డి చాలా మాటలు చెప్పాడని, చివరకు హ్యాండిచ్చి వెళ్లిపోయాడని అన్నారు. పిచ్చోని లెక్క ఆ ఇద్దర్నీ నమ్మినానని ఆవేదన వ్యక్తం చేశారు. మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గం బరిలో నిలబడి పోట్లాడదామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరినా, ఆయన స్వీకరించేలేదన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో  సీనియర్ నేతలు కడియం, కేకే కాంగ్రెస్ లో చేరుతున్నారని కేటీఆర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News