Sunday, December 22, 2024

బిసిల ఓట్ల కోసమే..

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి కోసమే
రాష్ట్రంలో కులగణన డ్రామా
బిసిలకు 42శాతం రిజర్వేషన్లు
అమలు చేశాకే స్థానిక ఎన్నికలకు
వెళ్లాలి బలహీన వర్గాలకు
బలమైన వెన్నుపోటు పొడిచారు
డిక్లరేషన్లన్నీ సిఎం రేవంత్
మెడకు పాములై చుట్టుకుంటాయి
ఒక్క రైతుకైనా బోనస్ ఇచ్చినట్లు
నిరూపిస్తే రాజీనామా చేస్తా
కాంగ్రెస్ విజయోత్సవాలకు
దీటుగా వైఫల్యాల వారోత్సవాలు
నిర్వహిస్తాం : కెటిఆర్

మనతెలంగాణ/వరంగల్ ప్రత్యేక ప్ర తినిధి: బిసిల ఓట్ల కోసమే ప్రభుత్వం కులగణన చేపడుతున్నదని మాజీమం త్రి, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. హన్మకొండ బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా స మావేశంలో ఆయన మాట్లాడుతూ… మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి పొందడాని కి కాంగ్రెస్ నేతలు డ్రామాలు ఆడుతు న్నారని విమర్శించారు. గత ఎన్నికల కు ముందు అన్ని వర్గాలకు డిక్లరేష న్ల పేరుతో మభ్యపెట్టిన కాంగ్రెస్, ఒక్కవర్గానికి కూడా మేలు చేయలేదని మండిపడ్డారు.డిక్లరేషన్లన్నీ సిఎం రేవంత్ రెడ్డి మెడకు
పాములై చుట్టుకుంటాయని హెచ్చరించారు. ఒక్క డిక్లరేషన్ కూడా అమలుచేయని రేవంత్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏడాది క్రితం ఇదే తారీఖున కామారెడ్డిలో కర్ణాటక సిఎం సిద్దరామయ్య సమక్షంలో బిసి డిక్లరేషన్ ప్రకటించి, అనేక హామీలిచ్చి ఓట్లు దండుకున్నారని వ్యాఖ్యానించారు. ఆ బిసి డిక్లరేషన్ హామీ ఏమైందని ప్రశ్నించారు. 2004లో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నపుడు కేంద్రంలో ఒబిసి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కెసిఆర్ కోరారని గుర్తుచేశారు. స్థానిక ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్ అమలుచేస్తామని మంత్రి పొంగులేటి చెప్పారని, వాటిని ప్రకటించి ఎన్నికలకు వెళ్లాలని సూచించారు.

కెసిఆర్ ప్రభుత్వంలో 2014 నుండి 2024 దాకా చాలా పథకాలు అమలు చేశామని చెప్పారు. కొత్త పథకాలు పెట్టకపోగా ఉన్న పథకాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించారు. ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేను ప్రజలు నిలదీస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు ఎందుకు కులగణన అని అడిగితే సమాధానం చెప్పలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. బిసిలకు మూడు లక్షల రూపాయల ఆదాయం ఉన్న కుటుంబానికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామన్న హామీ, బిసి యువతకు 10 లక్షల వడ్డీ లేని రుణం మర్చిపోయారని తెలిపారు. బిసిలకు ప్రత్యేకంగా లక్ష కోట్లు కేటాయిస్తామని చెప్పి రూ.20 వేల కోట్లకే పరిమితం చేశారని మండిపడ్డారు. బిసి కాంట్రాక్టర్లకు అన్యాయం చేశారని, ఏడాదిలో మంత్రిత్వ శాఖలు పూర్తిచేయలేని అసమర్థ సిఎం రేవంత్ కొత్తగా బిసి, ఎంబిసి మంత్రిత్వ శాఖలు అనడం హాస్యాస్పదం అని అన్నారు. బిసి ఐక్యతా భవనాలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. ముదిరాజ్‌లను బిసి ఏ లోకి మార్చుతానని మరిచిపోయారని అన్నారు.

చేతివృత్తుదారులకు రూ.4 వేల పింఛను ఇస్తామని చెప్పి మార్చిపోయారని తెలిపారు. రెండో దశ గొర్రెల పంపిణీ ఏమైందని ప్రశ్నించారు. గీత కార్మికుల కోసం 5 ఎకరాల భూమి ఎక్కడ ఇచ్చారని నిలదీశారు. రేవంత్ సర్కార్ పాలనలో 34 మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. సిరిసిల్లలో ఒక నేత కార్మికుల జంట ఆత్మహత్య చేసుకున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డల గోస పుచ్చుకుంటున్నదని మండిపడ్డారు. రజకులకు 10 లక్షల ల్యాండ్రీ ఏర్పాటు ఎక్కడ అని ప్రశ్నించారు. బలహీనవర్గాలకి సిఎం బలమైన వెన్నుపోటు పొడిచారని వ్యాఖ్యానించారు. దమ్ముంటే.. మొగాడివి అయితే ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వరంగల్‌లో హామీ ఇచ్చిన రైతు డిక్లరేషన్ అమలు ఎప్పుడని ప్రశ్నించారు. ఒక్క రైతుకైనా రూ.500 బోనస్ ఇచ్చావా అని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఒక్కరికీ ఇచ్చినట్లు నిరూపించినా తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా వదిలి పెట్టబోమని హెచ్చరించారు

. కాంగ్రెస్ పార్టీ చేపట్టనున్న వారోత్సవాలు, విజయోత్సవాలకు దీటుగా పరిపాలనా వైఫల్యాల వారోత్సవాలను బిఆర్‌ఎస్ చేపడుతుందని చెప్పారు. సమావేశంలో మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంఎల్‌సిలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, రవీందర్ రావు, ఎంఎల్‌ఎ కౌశిక్ రెడ్డి, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, నన్నపనేని నరేందర్, కుడా మాజీ ఛైర్మన్ సుందర్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News