గంగ పరవళ్లు తొక్కింది. ఆనంద భాష్పాలు కురిపిచ్చింది!’
పలు గ్రామాల ప్రజలు గోదావరి నీటిలో తడిసిముద్దవుతున్నారు
ట్విట్టర్ వేదికగా పలు ఫొటోలను షేర్ చేసిన మంత్రి కెటిఆర్
హైదరాబాద్: రాష్ట్ర ప్రజల వర ప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలు ఇప్పుడిప్పుడే అందుతున్నాయి. గోదావరి పరవళ్లను తెలంగాణ జిల్లాలకు దారి మళ్లీస్తూ నిర్మించిన కాళేశ్వరం నీరు పలు జిల్లాలకు ఇప్పటికే కాలువల ద్వారా చేరుతున్న విషయం తెలిసిందే. దీంతో గ్రామాల్లోని చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని గ్రామాలకు ఇప్పటికే గోదావరి జలాలు చేరాయి. దీంతో గ్రామాల్లోని చిన్న చిన్న చెక్ డ్యామ్‌లు జలకళను సంతరించుకున్నాయి. గ్రామాలకు చెందిన ప్రజలు గోదావరి నీటిలో తడిసిపోతున్నారు. ఈ క్రమంలోనే మన నట్టింటికి వచ్చిన గోదావరి నీటిలో తడుస్తూ ప్రజలు ఫొటోలు దిగుతున్నారు.
తాజాగా రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖల మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా దీనికి సంబంధించిన పలు ఫొటోలను షేర్ చేశారు. రాజన్న సిరిసిల్లా జిల్లా ముస్తాబాద్‌లో గోదావరి జలాలకు సంబంధించిన ఫొటోలు పోస్ట్ చేస్తూ.. ‘తెలంగాణ అస్తే ఏమొస్తది.? కన్నీరు కారిన చోటే.. గంగ పరవళ్లు తొక్కింది. ఆనంద భాష్పాలు కురిపిచ్చింది!’ అంటూ ఆసక్తికర క్యాప్షన్ జోడించారు. దీంతో ప్రస్తుతం మంత్రి కెటిఆర్ చేసిన ఈ ట్విట్ వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే తాజాగా సిఎం కెసిఆర్ కొండపోచమ్మ సాగర్ జలాశయం నుంచి సంగారెడ్డి కాల్వ ద్వారా హల్ది వాగులోకి గోదావరి జలాలను వదిలిన విషయం తెలిసిందే. ఎండకాలంలోనూ సాగునీటిని అందించేలా సంగారెడ్డి కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. దీంతో సిద్దిపేట, మెదక్ జిల్లాల పరిధిలోని చెరువులు జలకళను సంతరించుకున్నాయి.
తెలంగాణ అస్తే ఏమొస్తది.?
కన్నీరు కారిన చోటే
గంగ పరవళ్లు తొక్కింది
ఆనంద భాష్పాలు కురిపిచ్చింది!Pictures from yesterday; Mustabad Tank filled by water Kaleshwaram waters in mid summer 😊#జైతెలంగాణ✊#JaiTelangana #JaiKCR 🙏 pic.twitter.com/RDUFbRABI2
— KTR (@KTRTRS) April 7, 2021