- Advertisement -
హైదరాబాద్: ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కెటిఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ది పేమేంట్ కోటా.. డబ్బులిచ్చి పదవి తెచ్చుకున్నారు. నాది మేనేజ్ మెంట్ కోటా ఐతే.. రాహుల్, ప్రియంకాది ఏం కోటా అని కెటిఆర్ ప్రశ్నించారు. పేమెంట్ కోటా కాబట్టే రేవంత్ ఢిల్లీకి పేమెంట్ చేయాలన్నారు. బిల్డర్లు, వ్యాపారులను బెదిరించి రేవంత్ ఢిల్లీకి కప్పం కట్టాలని తెలిపారు. రేవంత్ సెస్ పై త్వరలో బిల్డర్లు, వ్యాపారులు రోడ్డెక్కుతారని చెప్పారు.
తమ ప్రభుత్వంలో కొన్ని తప్పులు జరిగిఉండొచ్చు. ప్రభుత్వంలో అన్ని సిఎం, మంత్రులకు తెలియాలని లేదన్నారు. తప్పులు జరిగాయనుకుంటే విచారించి చర్యలు తీసుకొండి. మార్చి 2 నుంచి బిఆర్ఎస్ ఎంపి అభ్యర్థిత్వాలపై కసరత్తు మొదలుకానుందన్న కెటిఆర్ ఎంపి అభ్యర్థిత్వాలపై కెసిఆర్ సమావేశాలు నిర్వహించనున్నారని పేర్కొన్నారు.
- Advertisement -