Monday, December 23, 2024

కెసిఆర్ ను నిలదీయాల్సింది కెటిఆర్: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. రాడార్ వ్యవస్థకు ఎందుకు అనుమతి ఇచ్చారో ముందు మీ నాన్న కెసిఆర్ ను నిలదీయ్ అని కెటిఆర్ కు బండి సంజయ్ సూచించారు. నాడు మీరే అనుమతిచ్చి, నేడు మీరే వ్యతిరేకిస్తారా? అని నిలదీశారు.

దేశ భద్రతను వ్యవస్థ ఏర్పాటును వ్యతిరేకించడమంటే, దేశ ప్రయోజనాలను వ్యతిరికించనట్లేనన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు బిఆర్ఎస్ కు బుద్ధి చెప్పినా మార్పు రాలేదని అన్నారు.

వికారాబాద్ జిల్లా దామగుండం అడవుల్లో విఎల్ఎఫ్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. అన్ని అడ్డంకులు దాటుకుని నేడు భూమి పూజ చేసుకోవడం ఆనందదాయకంగా ఉందన్నారు. ‘‘కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చొరవ తీసుకోవడం వల్లే ఇది సాధ్యమైంది’’ అన్నారు.

అధికారంలో ఉన్నప్పుడు ఈ రాడార్ వ్యవస్థ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన బిఆర్ఎస్ నేతలే నేడు వ్యతిరేకిస్తున్నారంటే ఏమనుకోవాలన్నారు. వాళ్లది ద్వంద్వ వైఖరి అని నిందించారు. కెటిఆర్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కెసిఆర్ ఫామ్ హౌజ్ ఎదుట ధర్నా చేయాలన్నారు. రాడార్ వ్యవస్థ ఏర్పాటుకు అనుమతిస్తూ భూముల బదలాయింపుకు ఎందుకు అంగాకారం తెలిపారో కెసిఆర్ ను నిలదీస్తే బాగుంటుందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News