Wednesday, January 22, 2025

మానవత్వం చాటుకున్న కెటిఆర్

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. తన నియోజకవర్గం సిరిసిల్ల నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా మార్గమధ్యంలో సిరిసిల్ల నుంచి 15 కిలోమీటర్ల దూరంలో జిల్లెల్ల వద్ద జరిగిన యాక్సిడెంట్‌ను గమనించారు. వెంటనే స్పందించి గాయపడిన వ్యక్తులను తన ఎస్కార్ట్ వాహనంలో సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్రంగా గాయాలు కావటంతో ఆయనే అంబులెన్స్‌కు కాల్ చేయడంతోపాటు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వారిని హాస్పిటల్‌ను వేగంగా తరలించే ప్రయత్నం చేశారు. కెటిఆర్ చేసిన పనిని పలువురు ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News