Thursday, December 26, 2024

కేంద్రాన్ని నిందించిన కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో ఉప్పల్, అంబర్‌పేట్ ఫ్లయ్‌ఓవర్ పనులు మందకొడిగా సాగడానికి కేంద్రమే కారణమని తెలంగాణ మంత్రి కెటి. రామారావు(కెటిఆర్) ఆదివారం తూర్పారబట్టారు. ట్విట్టర్‌లో ఒకరు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన జవాబిస్తూ ‘దురదృష్టం కొద్దీ ఫ్లయ్‌ఓవర్ల పనులను ‘నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఎఐ) నిర్వహిస్తోంది’ అన్నారు.

‘ఉప్పల్, అంబర్‌పేట్ ప్లయ్‌ఓవర్ల నిర్వహణ దురదృష్టంకొద్దీ నేషనల్ హైవేస్ నిర్వహిస్తోంది. ఆ రెండు ఫ్లయ్‌ఓవర్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి. జిహెచ్‌ఎంసి భూసేకరణ కూడా పూర్తి చేసింది. మేము 35 ప్రాజెక్టులను పూర్తి చేశాము. వారు రెండు కూడా పూర్తి చేయడంలేదు. అదే కెసిఆర్ ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం’ అని ట్వీట్ చేశారు.

కృష్ణ ఆర్‌కె అనే వ్యక్తి చేసిన మరో ట్వీట్‌లో బెంగళూరులో బిజెపి ప్రభుత్వం ఎన్‌హెచ్‌ఎఐ ప్రాజెక్టుల కన్నా పది రెట్లు మెల్లగా పనులు నిర్వహిస్తోందన్నారు. దానికి కెటిఆర్ ‘అదెట్లా సాధ్యం? డబుల్ ఇంజిన్, డబుల్ స్పీడ్ కాదా?’ అని చురక వేశారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News