Sunday, January 19, 2025

మూడు నెలలు కాదు.. మూడేళ్లు ఉంటా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఎల్‌బినగర్ : మూసీ పేరుతో ప్రజా ధనా న్ని లూటీ చేసేందుకు సిఎం రేవంత్‌రెడ్డి ప్లాన్ చేశారని బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కెటిఆర్ ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేస్తోంది బ్యూ టిఫికేషన్ కాదని, లూటిఫికేషన్ అని వ్యాఖ్యానించారు. ఎల్బీనగర్‌లోని నాగోల్‌లో మురుగు నీటి శుద్ధ్ది కేంద్రాన్ని (ఎస్‌టిపిల) జిహెచ్‌ఎంసి పరిధిలోని ఎంఎల్‌ఎలు, మాజీ మంత్రులు, ఎంఎల్‌సిలతో కలిసి ఆయన శనివారం పరిశీలించారు. అనంతరం కెటిఆర్ మాట్లాడుతూ…రూ.386 కోట్లతో కెసిఆర్ ప్రభుత్వం 31 ఎస్‌టిపిలను నిర్మించేందు కు సిద్ధమైన విషయాన్ని గుర్తు
చేశారు. వారసత్వ సంపదలను కాపాడుతునే అభివృద్ధి చేయావల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని అన్నారు.

రూ.545 కోట్లతో 15 బ్రిడ్జిలు నిర్మాణం చేపట్టిన ఘనత కెసిఆర్‌కు దక్కిందన్నారు. మూసీ నిర్వాసితులకు ఇస్తున్న ఇళ్లు కూడా కెసిఆర్ నిర్మించిన రెండు పడక గదులేనని తెలిపారు. మూసీ బాధితుల తరపున న్యాయ పోరాటం చేస్తామని, వారికి తమ పార్టీ అండంగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నాగోల్‌లో దేశంలోనే అతి పెద్ద మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని తమ హయాంలో నిర్మించామని, ఇక్కడ శుద్ధి చేసిన నీళ్లు నల్గ్గొండ జిల్లాకు పోతున్నాయని తెలిపారు. రేవంత్‌రెడ్డి కొత్తగా చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు. మూసీ గురించి తనకు తెలుసునని, ఆ ప్రాంతంలో మూడు నెలలు కాదు … మూడేళ్లు ఉంటానని, తాను గతంలో మూసీ నింబోలి అడ్డాలో ఉన్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సబిత ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ, ఎంఎల్‌ఎలు బండారి లకా్ష్మరెడ్డి, వివేకానందగౌడ్, మాధవరం కృష్ణారావు, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, ఎంఎల్‌సి సురభి వాణిదేవి, మాజీ కార్పొరేటరు, నాయకులు, కార్యకర్తలు పాల్గ్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News