Monday, December 23, 2024

ఎమర్జెన్సీని మరిపిస్తున్నారు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో ఉన్నది ఇందిరమ్మ రాజ్యం
కాదు అరెస్టు చేసిన లగచర్ల
రైతులను చిత్రహింసలు పెట్టారు
నడవలేని స్థితిలో రైతుల అవస్థలు
ఈ ప్రభుత్వ వ్యవస్థ మీద నమ్మకం
లేదు ప్రైవేటు డాక్టర్లతో పరీక్షలు
నిర్వహించాలి ముఖ్యమంత్రి
సోదరుడు రైతులను బెదిరించిన
ఆడియోలు మా దగ్గర ఉన్నాయి
కొడంగల్ రగులుతుంటే సిఎం
మహారాష్ట్రలో ప్రచారానికి వెళ్లడం
దారుణం అల్లుడి కోసమే రైతులపై
సిఎం దౌర్జన్యాలు నిప్పులు చెరిగిన
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : అల్లుడి కం పెనీ కోసమే రైతులపై సిఎం రేవంత్ రెడ్డి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని బిఆర్‌ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కెటిఆర్ ధ్వజమెత్తా రు. రేవంత్ ఆదేశాలతో కొడంగల్ రైతులను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టిన పోలీసులు రి మాండ్‌కు తరలిస్తుంటే రైతులు నడవలేకపోయారని కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బు ధవారం తెలంగాణ భవన్‌లో కెటిఆర్ ప్రెస్‌మీ ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ రైతులకు మెడికో లీగల్ పరీక్ష లు వెంటనే చేయాలని, ప్రభుత్వ వ్యవస్థ మీద నమ్మకం లేదని, అందుకే ప్రైవేటు డాక్టర్లతో ప రీక్షలు నిర్వహించాలని మేజిస్ట్రేట్‌ను కెటిఆర్ కోరారు.

ముఖ్యమంత్రి సోదరుడు రైతులను బెదిరించిన ఆడియో తమ దగ్గర ఉందని కెటిఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్నది ఇందిరమ్మ రాజ్యం కాదని, ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన అని కెటిఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫార్మా విలేజ్ వద్దని కొడంగల్ రైతులు సిఎంను, తమను, బిజెపి వాళ్లను కూడా కలిశారని ఆయన తెలిపారు. కొడంగల్ రగులుతుండటానికి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాలోచిత నిర్ణయాలే కారణమని ఆయన అన్నారు. రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించిన చందంగా ఈ ప్రభుత్వం తీరు ఉందని కెటిఆర్ మండిపడ్డారు. సొంత నియోజకవర్గంలో రైతులు అరెస్ట్ అవుతుంటే సిఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ప్రచారానికి వెళ్లారని ఆయన ఆరోపించారు.

నరేందర్‌రెడ్డి ఏమైనా బందిపోటా?
జాతీయ కాంగ్రెస్ నేతలకు తాబేదారుగా వ్యవహారిస్తూ సిఎం రేవంత్ ఇక్కడ పాలన గాలికి వదిలేశారని ఆయన ఆరోపించారు. పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయలేదని కిడ్నాప్ చేశారని ఆయన అన్నారు. నరేందర్‌రెడ్డి ఏమైనా బందిపోటా? భూసేకరణ పేరుతో ఎస్సీ, ఎస్టీ, బిసిల భూములను రేవంత్ రెడ్డి తన అనుచరులు, కుటుంబ సభ్యులకు ఇచ్చి రియల్ ఎస్టేట్ దందా చేసే ప్రయత్నం చేస్తున్నారని కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడంగల్లో ఇంటర్నెట్‌ను బంద్ పెట్టారని, అసలు ఇంటర్నెట్ బంద్ చేయటానికి వీలు లేదని ఆయన పేర్కొన్నారు. ఏ విధంగా పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులను అర్ధరాత్రి పూట అరెస్ట్ చేశారని కెటిఆర్ వాపోయారు.

ఇంట్లో వేడుకలు, కార్యక్రమాలు ఉన్నప్పటికీ రైతులను అరెస్ట్ చేసి వాళ్లను ఇబ్బంది పెట్టారని, ఇది పేదలను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వమని ఆయన పేర్కొన్నారు. ఇది ఊరికే తాను చెప్పటం లేదని కెటిఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి అల్లుడికి చెందిన మ్యాక్స్ బిఎన్ కంపెనీ విస్తరణ కోసమే రైతుల భూములను తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. భూములను తీసుకునే దాంట్లో అన్నం శరత్ అనే వ్యక్తి కూడా ఉన్నారని, ఆయన మెడికవర్ హాస్పిటల్ యజమాని అని ఆయన తెలిపారు. మెడికవర్ హాస్పిటల్ అల్లుడు, రేవంత్ రెడ్డి అల్లుడు ఇద్దరు ఒకే సంస్థలో డైరెక్టర్లు అని, వాళ్లిద్దరి కోసమే ఫార్మా విలేజ్ పేరుతో అక్రమాలు చేసేందుకు ముఖ్యమంత్రి కుట్ర చేస్తున్నారని కెటిఆర్ ఆరోపించారు. బెంగళూరులోనూ మెడికవర్ ఆస్పత్రిని అక్కడి డిప్యూటీ సిఎం డికె శివకుమార్ ప్రారంభించారని కెటిఆర్ గుర్తు చేశారు.

మా పార్టీ వాళ్లందరం కొడంగల్ వెళ్తాం
ఈ ముఖ్యమంత్రి భరతం పట్టే పనిని కొండగల్ నుంచే మొదలు పెడతామని, మా పార్టీ వాళ్లందరం కొడంగల్ వెళ్తామని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ స్పష్టం చేశారు. ఫార్మా విలేజ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, ఫార్మా సిటీ విషయంలో హైకోర్టును కూడా మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బయట ఫార్మా సిటీ రద్దు అంటున్నారు, కోర్టులో మాత్రం ఫార్మా సిటీ ఉందని చెబుతున్నారని కెటిఆర్ పేర్కొన్నారు. ఫార్మా సిటీ కోసం తీసుకున్న భూములను వేరే అవసరాలకు వాడటానికి వీలు లేదని ఆయన తెలిపారు.

ఫార్మా సిటీ పేరుతో ఫోర్త్ సిటీ, స్కిల్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారని ఆయన ఆరోపించారు అవసరం లేని చోట కూడా భూములు కొని రోడ్లు వేస్తూ ఇన్ సైడర్ ట్రేడింగ్ చేస్తున్నారన్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల కంపెనీల బాగోతాన్ని ధారావాహిక మాదిరిగా బయటపెడుతూనే ఉంటామని కెటిఆర్ తెలిపారు. ఫార్మా విలేజ్ పేరుతో రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసే నిర్ణయాన్ని మానుకోవాలని, ఫార్మా సిటీ కోసం రైతులు ఇచ్చిన భూమిని వారికి తిరిగి ఇస్తామని మాట ఇచ్చారని, ఎప్పుడు ఇస్తారో తేదీ చెప్పాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.

అనుముల కుటుంబ కుంభకోణాలు బయటపెట్టేందుకు ఢిల్లీకి వెళ్లా…
తాను ఢిల్లీకి వెళ్లింది అనుముల కుటుంబ కుంభకోణాలు బయటపెట్టేందుకు వెళ్లానని కెటిఆర్ తెలిపారు. తాను ఢిల్లీకి వెళితే బిజెపితో కాళ్ల బేరానికి వెళ్లినట్లా..? మరీ బిజెపికి చెందిన గవర్నర్‌ను రేవంత్ రెడ్డి కలిస్తే అది కాళ్ల బేరానికి వెళ్లినట్లు కాదా..?, అదానీ కాళ్లు పట్టుకొని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన మీద ఈడీ కేసు కాకుండా చూసుకున్నారా..? లేదా..? చెప్పాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. తాను మలేషియా వెళ్లకుండానే వెళ్లినట్లు మీడియా వాళ్లు ఎలా రాస్తారు..? అని కెటిఆర్ ప్రశ్నించారు. ఈ తుగ్లక్ ప్రభుత్వం నిర్ణయం కారణంగా అధికారులు బలి అవుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కుట్రలో అధికారులు బలి కావద్దని కోరుతున్నానన్నారు.

తమ ప్రభుత్వంలో కూడా భూ సేకరణ సమస్యలు వస్తే రైతులను మెప్పించి ఒప్పించి, వాళ్ల కడుపులో తల పెట్టి తాము మంచి పరిహారం ఇచ్చామన్నారు. మల్లన్న సాగర్ వంటి ప్రాజెక్టును పూర్తి చేశాం. కానీ, ఈ ముఖ్యమంత్రికి 9 నెలలుగా కొడంగల్లో ఆందోళన చేస్తున్న రైతులను కలిసే సమయం లేదని కెటిఆర్ మండిపడ్డారు. కలెక్టరే స్వయంగా దాడి జరగలేదని చెబుతున్నా, ఐజీ మాత్రం దాడి జరిగిందంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కానీ, ఇది ఇంటలిజెన్స్ వైఫల్యమని, దాడి జరుగుతున్న సమయంలో సెక్యూరిటీ ఏదీ? అని ఉద్దేశ పూర్వకంగా గొడవ సృష్టించి రైతులు భూసేకరణకు సహకరించటం లేదని భూములను గుంజుకునే కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రికి రియల్ ఎస్టేట్ ఫార్ములా, బ్యాగుల ఫార్మూలా మాత్రమే తెలుసనీ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

రేవంత్‌కు ఈ రేస్ అంటే ఏంటో తెలుసా..?
రేవంత్‌కు ఈ రేస్ అంటే ఏంటో తెలుసా..? అని కెటిఆర్ ప్రశ్నించారు. 11 నెలలుగా రోజుకో కుంభకోణం పేరుతో టైంపాస్ ప్రచారం చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని మీడియా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కెటిఆర్ సూచించారు.
పట్నం నరేందర్ రెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించిన కెటిఆర్
పట్నం నరేందర్ రెడ్డి నివాసానికి వెళ్లిన కెటిఆర్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పి భరోసా కల్పించారు. కెటిఆర్ వెంట మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జి.జగదీశ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి సహా పలువురు బిఆర్‌ఎస్ నేతలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News