ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మరోసారి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఫైరయ్యారు. మా భూములు గుంజుకోవద్దని కొడంగల్ రైతులు కోరుతున్నారని.. వారి బాధలు వినే ఓపిక, తీరిక సీఎంకు లేవని మండిపడ్డారు. లగచర్ల ఘటనకు నిరసనగా మహబూబాబాద్ జిల్లా మానుకోటలో బీఆర్ఎస్ మహాధర్నాకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో మానుకోటకు ప్రత్యేక స్థానం ఉంది.కొత్త నియంత రేవంత్‌కు మానుకోట ధర్నా బుద్ధి చెప్పబోతుంది. 9 నెలలుగా కొడంగల్‌లో ఎస్టీ, ఎస్సీ, బీసీ రైతులు తిరగబడ్డారు.
మూడు వేల ఎకరాలు గుంజుకోవాలని సీఎం ప్రయత్నిస్తున్నారు. రేవంత్ 28 సార్లు ఢిల్లీ వెళ్లినా.. 28 రూపాలయలు కూడా తీసుకురాలేదు. లగచర్లలో జరిగిన దాడి అధికారులపై జరిగింది కాదు. లగచర్లలో దాడి జరిగితే మానుకోటలో ధర్నా ఎందుకని పోలీసులు అంటున్నారు. ఎక్కడ గిరిజన, ఎస్సీ, బీసీ, బడుగు రైతులు ఉంటారో అక్కడ ధర్నా చేస్తాం” అని కేటీఆర్ అన్నారు.