Saturday, February 8, 2025

రేవంత్ ను తెలుగు భాషలో ఉన్న తిట్లన్ని తిడుతున్నరు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

మన ఐరన్ లెగ్ రేవంత్ రెడ్డి.. ఢిల్లీ పోయి కాంగ్రెస్ పార్టీకి సున్నా సీట్లు తెప్పించిండని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎద్దేవా చేశారు. శనివారం బిఆర్ఎస్ భవన్ లో జరిగిన సిర్పూర్ కాగజ్ నగర్ బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో కెటిఆర్ మాట్లాడుతూ.. దేశంలో ప్రధాని నరేంద్ర మోడీకి అతిపెద్ద స్టార్ క్యాంపెయినర్లు అంటే.. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అని సెటైర్ వేశారు.

“రేవంత్ రెడ్డి దుర్మార్గపు పాలనతో పేద ప్రజల మీద పడ్డాడు. తన సొంత నియోజకవరక్గం కొడంగల్‌లోని రోటిబండ తండాలో 110 ఎకరాల భూమి కావాలని 400 మంది పోలీసులను పంపించాడు.హైదరాబాద్ లోని నాచారంలో చెప్పులు కుట్టుకునే అతని దుకాణం, పాలు అమ్ముకునే ఆమెది చిన్న డబ్బాను కూడా వదలకుండా కూలగొట్టించాడు. రేవంత్ రెడ్డిని తెలుగు భాషలో ఉన్న తిట్లన్ని తిడుతున్నారు. వేరే వారైతే సిగ్గుతో చచ్చిపోయేవారు.. రేవంత్ రెడ్డికి సిగ్గు లేదు కాబట్టి బ్రతుకుతున్నాడు” అని కెటిఆర్ విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News