Monday, March 31, 2025

ఫోర్త్ సిటీ..ఓ రియల్ డ్రామా

- Advertisement -
- Advertisement -

సొంత భూముల రేట్లు
పెంచుకోవడానికే సిఎం
రేవంత్ రెడ్డి ప్రయత్నాలు
36సార్లు ఢిల్లీకి పోయివచ్చినా..
30 పైసలు కూడా తేలే
ఆమన్‌గల్ రైతుదీక్షలో బిఆర్‌ఎస్
వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
మన తెలంగాణ/ఆమనగల్లు: 420 దొంగ హా మీలు ఇచ్చి రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యార ని మాజీ మంత్రి బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అ ధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే,పథకాల పేరుతో కాం గ్రెస్ ప్రభుత్వం డ్రామాలు చేస్తుందని ఆయ న ఎద్దేవా చేశారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు ప ట్టణంలో మంగళవారం బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతుదీక్షలో కేటీఆర్ పా ల్గొని ప్రసంగించారు. సిఎం ప్రతి రైతుకు ఎకరా కు రూ. 17500 బకాయి పడ్డారని, ఈ సొ మ్మును వారి ఖాతాల్లో జమ చేశాకే స్థానిక సం స్థల ఎన్నికల్లో ఓట్లు అడగాలని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో దుర్మార్గ పు పాలన నడుస్తుందని విమర్శించారు. ఈ దరిద్రపు పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషం గా లేదని, పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రైతులు రాజుల బతికారని, కేసీఆర్ రైతుబంధు వేస్తే రేవంత్ ఇంకా వేస్తాననే అంటున్నాడని విమర్శించారు.

కొడంగల్‌కు వలస వెళ్లిన రేవంత్‌రెడ్డి అక్కడ ఎవరికీ న్యాయం చేయలేదని, సొంత నియోజకవర్గం అయిన కల్వకుర్తి, అచ్చంపేటలకు ఏ ఒక్క పని చేయలేదని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి అత్తగారి ఊరు కల్వకుర్తిలో ఉన్న ఆడబిడ్డలకు రూ. 2500 ఇవ్వలేదు, తులం బంగారం ఇవ్వడం కాదా మెడలో పుస్తెల తాడు కూడా పట్టుకొని పోతాడంటూ కేటీఆర్ ఘాటు గా విమర్శించారు. ప్రభుత్వానికి ఇంటికి పం పించే ఉపాయం లేదా అని అన్ని వర్గాల ప్రజలు అడుగుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రిని తిట్టని తిట్లు ప్రజలు తిడుతున్నారని తెలిపారు. ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ పేర్లతో కాంగ్రెస్ డ్రామాలు చేస్తుందని మండిపడ్డారు. వెల్దండలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబానికే 500 ఎకరాల భూమి ఉందని, ఎన్నికలు అయ్యాక 1000 ఎకరాలు కొనుగోలు చేశారని ఆయన ఆరోపించారు. తన భూముల రేట్లు పెంచుకోవడానికే ఫోర్త్ సిటీ అంటున్నారని, రేవంత్‌రెడ్డికి రాష్ట్రం అవసరం లేదని రియల్‌ఎస్టేట్ మాత్రమే ఉంటే చాలని విమర్శించారు. రేవంత్‌రెడ్డి 36 సార్లు ఢిల్లీకి పోయిండు కాని రాష్ట్రానికి 30 పైసలు కూడా తేలేదని ఆరోపించారు.

కాంగ్రెస్ 14నెలల కాలంలో 430 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, గురుకులాలు నిర్వీర్యమయ్యాయని, గురుకులాల్లో వసతులు లేక 56 మంది బిడ్డలు చనిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో అన్ని వర్గాలను ఆదుకున్నాడని రైతుబంధు పథకంతో రూ. 73 వేల కోట్లు రైతుల ఖాతాలో వేసాడని గుర్తు చేశారు. ఆ రైతుధర్నాలో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సబిత ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు సురబి వాణిదేవి, నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గుర్కా జైపాల్‌యాదవ్, గువ్వల బాలరాజ్, మర్రి జనార్ధన్‌రెడ్డి, లకా్ష్మరెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అంజయ్య యాదవ్, రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోళి శ్రీనివాస్ రెడ్డి, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, డిసిసిబీ డైరెక్టర్ గంపా వెంకటేష్ గుప్తా, మాజీ జెడ్పిటీసీలు జర్పుల దశరథ్ నాయక్, నేనావత్ అనురాధ పత్యానాయక్, కల్వకురి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎడ్మ సత్యం తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News