Thursday, January 23, 2025

మాట తప్పిన సిఎం.. క్షమాపణ చెప్పాలి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఎల్‌ఆర్‌ఎస్ దండగ అన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు దాన్ని ఎందుకు అమలు చేస్తున్నారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు ప్రశ్నించారు. ఎల్‌ఆర్‌ఎస్ సంబంధించి పలు ప్రశ్నలను సంధిస్తూ శనివారం కెటిఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. తెలంగాణ రా ష్ట్ర ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను గౌరవిస్తూ ఎల్‌ఆర్‌ఎస్ పథకం లో ఎలాంటి చార్జీలు లేకుండా భూముల రెగ్యులరైజేషన్‌కు మార్గదర్శకాలను వెం టనే విడుదల చేయాలని కోరారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను, అమ లు చేస్తున్నామని పదేపదే చెప్పుకుంటూ, ప్రచారం చేసుకుంటున్న సిఎం 25.44 ల క్షల దరఖాస్తుదారుల కుటుంబాలకు జరి గే లబ్ధిని దృష్టిలో ఉంచుకొని వెంటనే ఉచి త ఎల్‌ఆర్‌ఎస్ మార్గదర్శకాలను విడుదల చేయాలని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల కు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భా గంగా ఎల్‌ఆర్‌ఎస్ గురించి మాట్లాడిన మాటలను మీరు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలని సిఎంను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

స్వయంగా మీతో సహా ప్రస్తుతం మీ కేబినెట్‌లో సహచరులుగా ఉన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వంటి నేతల మాటలను కెటిఆర్ ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డికి గుర్తు చేస్తున్నాను. వారు ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉచితంగా అందిస్తామంటూ ప్రజలకు పదేపదే హామీలు ఇచ్చారని, రేవంత్‌రెడ్డి కూడా ఎల్‌ఆర్‌ఎస్ గురించి మాట్లాడుతూ భవిష్యత్తులో ప్రభుత్వం మ్యారేజ్ రెగ్యులరైజేషన్ స్కీం కూడా తీసుకొస్తుందేమో అని మాట్లాడారని, ఈరోజు ఎల్‌ఆర్‌ఎస్‌ను ప్రజలపైన పెను భారం వేసేలా అమలు చేసేందుకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. గత ఎన్నికలకు ముందు ప్రస్తుత డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎల్‌ఆర్‌ఎస్ అంటే ప్రజల నుంచి డబ్బులు దోపిడీ చేయడమే, అయినా ప్రభుత్వాలకు ప్రజలు తమ సొంత డబ్బులతో కొనుగోలు చేసిన భూములపైన రెగ్యులరైజేషన్ పేరుతో వాటాలు ఎందుకు తీసుకుంటుంది అన్నారని,

మరి ఇప్పుడు ప్రభుత్వం ప్రజల నుంచి చార్జీల రూపంలో ఎందుకు దోపిడీ చేస్తుందో సిఎం చెప్పాలని అడిగారు. ఎల్‌ఆర్‌ఎస్ వద్దు అంటే ప్రజలంతా, నో ఎల్‌ఆర్‌ఎస్- నో బిఆర్‌ఎస్ అనాలి, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్‌ను అమలు చేస్తాం అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజలను మభ్య పెట్టేలా మాట్లాడారని కెటిఆర్ గుర్తు చేశారు. ఎల్‌ఆర్‌ఎస్ రూపంలో ప్రభుత్వం ప్రజల రక్త మాంసాలను పీలుస్తుంది అని సీతక్క అన్నారని పేర్కొన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ రద్దు చేయాలి అంటూ ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గతంలో కోర్టుకు సైతం వెళ్లారని అన్నారు. ఇలా ప్రజలను మభ్య పెట్టేలా, బహిరంగంగా మాట్లాడిన మీ క్యాబినెట్ సహచరులను అడిగిన తర్వాతనే ఈ ఎల్‌ఆర్‌ఎస్ పైన చార్జీలు వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నారా అనేది ప్రజలకు మీరు వివరిస్తే బాగుంటుందని సిఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

తప్పుడు హామీలకు ప్రజలకు క్షమాపణ చెప్పాలి
ప్రజా పాలన, ప్రజా సంక్షేమం, గ్యారంటీల అమలు, హామీలు అమలు అంటూ విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్న సిఎం, రాష్ట్ర ప్రభుత్వం మరి రాష్ట్రంలో ఉన్న పేద మధ్యతరగతి ప్రజల పైన 20 వేల కోట్ల రూపాయల మేర ఎల్‌ఆర్‌ఎస్ చార్జీల భారం వేయడం కాంగ్రెస్ ద్వంద నీతికి, పరిపాలనలో, హామీల అమలులో మీ డోల్లతనానికి అద్ధం పడుతుందని కెటిఆర్ విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న 25.44 లక్షల కుటుంబాల పైన కనీసం లక్ష రూపాయల చొప్పున భారం వేస్తున్న ప్రభుత్వం.. ఏ విధంగా ప్రజా ప్రభుత్వం అవుతుందో చెప్పాలని లేఖలో నిలదీశారు. ప్రజల నుంచి 20వేల కోట్ల రూపాయల డబ్బులను గుంజుకుంటున్న ప్రభుత్వం దయలేని ప్రభుత్వం అవుతుంది కానీ.. ప్రజా ప్రభుత్వం ఎలా అవుతుందని పేర్కొన్నారు. ఒకవేళ ప్రభుత్వ విధానం ప్రజల వద్ద నుంచి ఎల్‌ఆర్‌ఎస్ చార్జీలు వసూలు చేయడమే అయితే మరి గతంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా చెప్పిన తప్పుడు మాటలకి, తప్పుడు హామీలకు ఇప్పుడు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇప్పటికే ప్రభుత్వం గ్యారెంటీల అమలు అంటూ ఊదరగొడుతూనే, మరోవైపు లబ్ధిదారుల ఎంపిక విషయంలో అనేక పరిమితులు, నియంత్రణ చేస్తున్న విషయం సైతం ప్రజలకు అర్థమవుతున్నదని చెప్పారు. ఎల్‌ఆర్‌ఎస్ విషయంలోనూ కాంగ్రెస్ ద్వంద వైఖరిని ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. అందుకే మీరు ఇచ్చిన హామీలను, చెప్పిన మాటలను గుర్తు చేస్తూ ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యతను ప్రజల తరఫున నిర్వహిస్తున్నామని కెటిఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎల్‌ఆర్‌ఎస్ విషయంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టడంతో పాటు కలెక్టర్లు, ఆర్‌డిఒల ద్వారా ప్రజలు కోరుకుంటున్న ఉచిత రెగ్యులరైజేషన్ డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చామని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని, సిఎం అసెంబ్లీలో చెప్పిన మాట అవగింజంత వాస్తవమే అయితే వెంటనే ఎల్‌ఆర్‌ఎస్ మార్గదర్శకాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా ఫీజుల రూపంలో తీసుకోకుండా వారి ప్లాట్లను రెగ్యులరైజ్ చేయాలని ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ మేరకు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కెటిఆర్ సిఎం రేవంత్‌రెడ్డికి రాసిన లేఖలో కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News