Friday, December 20, 2024

మేము నిర్మిస్తే..మీరు కూల్చేస్తున్నారు:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

మూసీ నది సాక్షిగా మహా నగరంలో కెసిఆర్ లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించి ఇచ్చారని, కాంగ్రెస్ విష ప్రచారాలు, అబద్ధాలు అనడానికి మరో సాక్ష్యం ఇదేనని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. తాము నిర్మించిన నిర్మాణాలను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమది నిర్మాణం, కాంగ్రెస్‌ది విధ్వంసం అంటూ కెటిఆర్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. లక్షల నిర్మాణాలు తమవి అయితే, లక్షల కూల్చివేతలు మీవి అని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.

ఇళ్లు కట్టలేదు అని అన్నారు.. ప్రజలను మభ్యపెట్టాం అన్నారు.. మరి లక్ష ఇళ్లు రాత్రికి రాత్రి ఎక్కడ నుంచి పుట్టుకొచ్చాయి చిట్టి అంటూ ఎద్దేవా చేశారు. మీ పాలనలో మీ అధికారులే మీ టేబుల్ ముందు పెట్టిన ‘డబుల్’ లెక్కలు చూసి మతిపోతుందా..? అని సిఎం రేవంత్‌రెడ్డిని అడిగారు. కెసిఆర్ నిజం, ఆయన హామీలు నిజం, ఆయన మాట నిజం అని తెలిసి మింగుడుపడటం లేదా..? అని ప్రశ్నించారు. మీ జూటా మాటలు, మీ కుట్రలకు, మీ దిమాక్ తక్కువ పనుల డ్యామేజ్ కంట్రోల్‌కు కెసిఆర్ నిర్మాణాలే దిక్కయ్యాయని విమర్శించారు. మీ నాలుకలు తాటి మట్టాలు కాకుంటే, ఇంకోసారి అబద్ధాలు మాట్లాడకండి అని కెటిఆర్ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News