Sunday, December 22, 2024

పల్లెల్లో పాలన పడకేసింది.. పట్టణాల్లో పరిస్థితి అధ్వాన్నంగా మారింది : కెటిఆర్

- Advertisement -
- Advertisement -

పదేళ్లు పచ్చగా కళకళలాడిన పల్లెలు, ప్రగతిపథంలో దూసుకుపోయిన పట్టణాలు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సంక్షోభంలో కొట్టుమిట్టాడటం ప్రభుత్వ అసమర్థత, పాలనా వైఫల్యాలకు నిలువెత్తు నిదర్శనమని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో పల్లెలు, పట్టణాలు కంపు కొడుతున్నాయని పేర్కొన్నారు. ఓవైపు తెలంగాణ పల్లెల్లో పాలన పూర్తిగా పడకేసిందని, మరోవైపు పట్టణాల్లో పరిస్థితి అధ్వాన్నంగా మారిందని అన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోవడంతో పంచాయతీలు

తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయిని అన్నారు. పాత పనులకు ఎనిమిది నెలలైనా బిల్లులు చెల్లించకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన తాజా మాజీ సర్పంచుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని పేర్కొన్నారు. పారిశుధ్యం, డ్రైనేజీ నిర్వహణ అధ్వాన్నంగా మారడంతో పల్లెల్లో ప్రజల జీవనం దినదిన గండంలా మారిందని, దోమల మందుకు కూడా నిధులు లేకపోవడంతో పంచాయతీల్లో డెంగ్యూ, మలేరియా విజృంభిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News