Friday, September 20, 2024

రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ పేరిట కాంగ్రెస్ చేసిందల్లా.. దగా.. నయవంచన

- Advertisement -
- Advertisement -

రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ పేరిట.. కాంగ్రెస్ చేసిందల్లా.. దగా.. నయవంచన మాత్రమే అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. చారాణ రుణమాఫీకి బారాణా ప్రచారం చేసుకుంటూ మాటలకందని మోసం చేస్తున్నారని విమర్శించారు. ఇది ముమ్మాటికి రైతులను ద్రోహం చేయడమే అని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో రైతులందరికీ రుణమాఫీ అని ఆశచూపారని, పరుగు పరుగున వెళ్లి రూ.2 లక్షలు రుణం తెచ్చుకోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారని గుర్తు చేశారు.

డిసెంబర్ 9న ఏకకాలంలో మొత్తం రుణం మాఫీ చేస్తామన్నారని, తీరా అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు దాటాక, కోటి ఆంక్షలు, శతకోటి షరతులతో లక్షలాది మంది రైతులను నిండా ముంచేశారని అన్నారు. ఇప్పుడు చేసిన రుణమాఫీ తీరుతో కాంగ్రెస్ అంటేనే మొండిచెయ్యి అని మరోసారి రుజువు చేశారని విమర్శించారు. రుణమాఫీ పేరుతో నమ్మించి మోసం చేసిన ముఖ్యమంత్రిని, తెలంగాణ రైతులు ఎప్పటికీమాఫ్ చెయ్యరనీ అన్నారు. రుణమాఫీ కాని రైతులు.. రేపటి నుంచి రోడ్డెక్కడం ఖాయమని, రైతులను నిండాముంచిన కాంగ్రెస్‌ను నిలదీయడం తథ్యమని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News