Saturday, November 16, 2024

ఫిరాయింపు ఎంఎల్‌ఎకు పిఎసి ఛైర్మన్ పదవా..?:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

ఫిరాయింపు ఎంఎల్‌ఎకు పిఎసి ఛైర్మన్ పదవా.. ? సిగ్గు.. సిగ్గు అంటూ బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. పార్టీ మారిన ఎంఎల్‌ఎల అనర్హతపై హైకోర్టు తీర్పు ఇచ్చిన రోజే ఇదేం దుర్మార్గం..? అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పిఎసి ఛైర్మన్ హోదాను, పార్టీ మారిన ఎంఎల్‌ఎకు కట్టబెట్టడం ఎక్కడి సంస్కృతి..? అని అడిగారు. గీత దాటిన కాంగ్రెస్ ప్రభుత్వం..రాజ్యాంగాన్ని పూర్తిగా కాలరాస్త్తోంది… సంప్రదాయాలను మంటగలుపుతోంది..పజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని పేర్కొన్నారు.

పార్లమెంట్‌లో పిఎసి ఛైర్మన్ పదవిని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఎంపి కెసి వేణుగోపాల్‌కు కట్టబెట్టిన విషయం మరిచారా..? అని నిలదీశారు. దేశ అత్యున్నత చట్టసభలో ఒక న్యాయం..? రాష్ట్ర అత్యున్నత చట్టసభలో మాత్రం అన్యాయమా..? అని ప్రశ్నించారు.

రైతు భరోసా ఇంకెప్పుడు..?
వానాకాలం సీజన్ అయిపోవడానికి ఇంకా 21 రోజులే ఉంది అని, రైతు భరోసా ఇంకెప్పుడు ఇస్తావ్ రేవంత్ అంటూ కెటిఆర్ సిఎంను అడిగారు. ఇచ్చే ఉద్దేశ్యం ఉందా..? లేక ఇది కూడా రుణమాఫీ లెక్కనే ఎగ్గొట్టుడేనా..? అని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News