కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ గాలిలో దీపంలా మారిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సార్లు లేని బడులు, లెక్చరర్లు లేని కాలేజీలు, చివరకు చాక్‌పీసులు-, డస్టర్లులేని స్కూళ్లు, అద్దె చెల్లించలేదని కాలేజీకి తాళాలు, రోడ్లపైకి విద్యార్థులు తెలంగాణలో కనిపిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్(ఎక్స్) ద్వారా కేటీఆర్ స్పందించారు. తెలంగాణలో విద్యావ్యవస్థలో ఉన్న సమస్యలకు సంబంధించిన పలు వార్త కథనాలను షేర్ చేశారు. పదుల సంఖ్యలో ఢిల్లీకి చక్కర్లు కొట్టే ముఖ్యమంత్రి మీ సొంత నియోజకవర్గంలో అధ్యాపకులు లేక విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గిరిజనులకు ఖర్చు చేయాల్సిన సొమ్ము తెలంగాణ ఎన్నికలకు : వాల్మీకీ స్కామ్ పైసలే తెలంగాణ కాంగ్రెస్ మొన్న లోక్‌సభ ఎన్నికల్లో వాడిందని ముందు నుంచి తాము అన్నదే నిజమైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వాల్మీకి కుంభకోణంలో కాంగ్రెస్ నేత, కర్ణాటక మాజీ మంత్రి బీ నాగేంద్రనే కీలక సూత్రధారి అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన చార్జిషీట్‌లో నిర్ధారించిందని కేటీఆర్ అన్నారు. ఆ సొమ్ము తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మొన్న లోక్‌సభ ఎన్నికల ఫండింగ్ కోసం ఉపయోగించిందని పేర్కొన్నారు దర్యాప్తు సంస్థలు వాల్మీకి స్కామ్ నిజాలు నిగ్గుతేల్చాలని, దోషులను కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు.
‘మంచినీళ్లను కూడా వదలని జూటా కాంగ్రెస్‘ అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రాజ్యంలో ప్రతి పేదవాడి బతుకు ఆగమవుతోందని విమర్శించారు. కేసీఆర్ ప్భ్రుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నింటినీ వరుసగా ర్ద్దు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచినీళ్ల పథకానికి కూడా తూట్లు పొడిచిందని ధ్వజమెత్తారు. గృహజ్యోతి పథకానికి తూట్లు పొడిచిన కాంగ్రెస్ బీఆర్‌ఎస్ హయాంలో అమలు చేసిన 20 వేల లీటర్ల ఉచిత మంచి నీటి పథకంపై కూడా కుట్రలు చేసిందని ఆరోపించారు.