Saturday, April 5, 2025

అన్ని రంగాలను ఆగం చేశారు.. కాంగ్రెస్ పై కెటిఆర్ ఫైర్

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్‌ విధానాలపై మాజీ మంత్రి కేటీఆర్‌ సోషల్ మీడియా వేదికగా ఫైరయ్యారు. మీ అనాలోచిత విధానాలతో ఆర్థికాభివృద్ధికి బ్రేకులు వేశారని మండిపడ్డారు. 10 నెలల పాలనలోనే అన్ని రంగాలను ఆగం చేశారని దుయ్యబట్టారు. కూల్చివేతలతో రియల్ ఎస్టేట్‌ కుదేలైందని, ఆర్థిక వ్యవస్థపై మీరెన్ని అధ్యయనాలు చేసిన ప్రయోజనం లేదని విమర్శించారు.

“నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత దాడులు చేసేవారిపై పోరాటం చేస్తాం. మంత్రి కొండా సురేఖపై రూ. వంద కోట్లకు పరువునష్టం దావా వేశా. ఇలాంటి చౌకబారు ఆరోపణలకు అడ్డూ అదుపు ఉండటం లేదు. సామాజిక మాధ్యమాల ద్వారా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నం. ఇకనుంచి అలాంటి ఆరోపణలు చేయకుండా లక్ష్మణరేఖ గీయాలి. చౌకబారు విమర్శలు చేసేవారికి ఈ వ్యాజ్యం గుణపాఠం కావాలి. కోర్టులో నిజం గెలుస్తుందనే నమ్మకం ఉంది. వ్యక్తిగత వివాదాల కంటే ప్రజాసమస్యలకే నేను ప్రాధాన్యం ఇస్తా. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పదేళ్లు బుల్లెట్‌ వేగంతో పరుగులు తీసింది. కాంగ్రెస్‌ ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలైంది” అని ఎక్స్ లో కెటిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News