Sunday, December 22, 2024

కెసిఆర్ పేరు ఎవరూ చెరిపేయలేరు

- Advertisement -
- Advertisement -

సిఎం రేవంత్‌పై తీవ్రస్థాయిలో
విరుచుకుపడిన బిఆర్‌ఎస్
వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
తెలంగాణను సగర్వంగా
తలెత్తుకునేలా చేసిన కెసిఆర్
రాష్ట్రానికే గర్వకారణమని
స్పష్టీకరణ

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ఉన్నంత కాలం కెసిఆర్ ఉంటారు…ఆ పేరును ఎవరు చెరిపేయలేరు…గుర్తు పెట్టుకో మిస్టర్ చీప్ మినిస్టర్ రేవంత్ అంటూ బిఆర్‌ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కెటిఆర్ ఘా టుగా స్పందించారు. నువ్వు స్లిపర్లు వేసుకొని రాజకీయాల్లోకి వచ్చేందుకు పనికిమాలిన పో రనిలా తిరుగుతున్నప్పుడే …ఆయన తెలంగా ణ కోసం, తెలంగాణ ప్రజల కోసం తన పదవి కి తృణప్రాయంగా రాజీనామా చేశాడు.. ను వ్వు పార్టీ టిక్కెట్ కోసం లాబీయింగ్‌లో బిజీ గా ఉన్నప్పుడే…ఆయన తెలంగాణ స్వరాష్ట్రం కావాలని స్వాప్నించాడు అంటూ రేవంత్‌రెడ్డి ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కెసిఆర్ ఎంతో ప ట్టుదలతో పోరాటం చేసి తెలంగాణ సాధించారన్నారు.

తెలంగాణ గొంతుకలను అణచివేయడానికి నువ్వు తుపాకీ పట్టుకున్నప్పుడు… ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను పణంగా పెట్టాడని, తెలంగాణ రాష్ట్రాన్ని అస్థిరపరచడానికి నీ చేతులు ‘డబ్బుల బ్యాగులు’ పట్టుకున్నప్పుడు…సాధించిన తెలంగాణను దేశంలోనే చరిత్ర సృష్టించే విధంగా తయారు చేసేందుకు ఆయన తన మేధస్సుకు పదును పెట్టారని తెలిపారు. సాధించిన తెలంగాణను సగర్వంగా తలెత్తుకొనేలా చేసిన కెసిఆర్ ఈ రాష్ట్రానికి గర్వకారణం..నీలాంటి జోకర్ ఆయన మీద పిచ్చి ప్రచారాలు చేస్తూ, దుర్భాషలాడి చరిత్ర నుంచి ఆయన పేరు చెరిపివేయవచ్చని అనుకోవటం మూర్ఖత్వమని సిఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ పేర్కొన్నారు.

మిత్తితో సహా చెల్లిస్తాం : పోలీసులకు కెటిఆర్ హచ్చరిక
హుజురాబాద్ ఎంఎల్‌ఎ కౌశిక్ రెడ్డిపై పోలీసుల దాడిని కెటిఆర్ ఖండించారు. దళిత బంధు లబ్ధిదారులకు రెండో విడత ఆర్థిక సాయం చేయాలని అడిగితే ఎంఎల్‌ఎ అని కూడా చూడకుండా పోలీసులు విచక్షణరహితంగా దాడి చేస్తారా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రజా ప్రతినిధులపై కూడా దాడికి తెగబడటమేనా ఇందిరమ్మ రాజ్యమంటే..? అని అడిగారు. ఇచ్చిన హామీలు అమలు చేయటం చేతగానీ దద్దమ్మ రేవంత్ సర్కార్…అడిగిన వారిపై దాడులు చేసే సంస్కృతికి తెరలేపిందని మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దల మెప్పు పొందేందుకు పోలీసులు ఓవరాక్షన్ చేస్తే…తాము వచ్చాక తప్పకుండా మిత్తితో చెల్లిస్తామని హెచ్చరించారు.

కౌశిక్ రెడ్డి అంటే ఈ సిఎం రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందని, ప్రభుత్వాన్ని ఎప్పటికప్పడు నిలదీస్తున్న కౌశిక్ రెడ్డిపై రేవంత్ రెడ్డి కక్ష పెంచుకున్నాడని ఆరోపించారు. మొన్న ఈ మధ్యనే బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎంఎల్‌ఎ గాంధీతో గుండాగిరి చేయించి కౌశిక్ రెడ్డిపై దాడి చేసే ప్రయత్నం చేశారని, అయినా వెనక్కి తగ్గకుండా ప్రజల కోసం పోరాటం చేస్తున్న కౌశిక్ రెడ్డిపై ఈసారి పోలీసుల ద్వారానే రేవంత్ రెడ్డి దాడి చేయించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే భయపడి దాడులకు పాల్పడే ఇంత పిరికి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు బిఆర్‌ఎస్ సైనికులెవరు భయపడరని స్పష్టం చేశారు. కౌశిక్ రెడ్డిపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, అదే విధంగా పోలీసులు అరెస్ట్ చేసిన బిఆర్‌ఎస్ కార్యకర్తలందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

నేడు హన్మకొండకు కెటిఆర్
ఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆదివారం హన్మకొండ, వరంగల్‌లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు హన్మకొండలో బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తక్కల్లపల్లి సత్యనారాయణ రావు కూతురి వివాహానికి హాజరవుతారు. మధ్యాహ్నం 1:30 గంటలకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎంఎల్‌ఎ, జిల్లా పార్టీ అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో భోజనం చేసిన తర్వాత పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News