Wednesday, January 8, 2025

ప్రశ్నిస్తే కేసులా?

- Advertisement -
- Advertisement -

బడిపిల్లలకు బాసటగా నిలిస్తే అరెస్టు

చేస్తారా? దేనికీ విజయోత్సవాలు?
పండుగలు మీకు..పస్తులు రైతులకు?
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఫైర్

మన తెలంగాణ/హైదరాబాద్ : బడి పిల్లలకు బాసటగా నిలిచిన బిఆర్‌ఎస్‌వి నాయకుల అక్రమ అరెస్ట్ అప్రజాస్వామికమని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. విద్యార్థి నాయకులకు వెంటనే విడుదల చేయాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. బుధవారం అరెస్టు చేసి ఇప్పటికీ తమ విద్యార్థి నా యకుల జాడ చెప్పకుండా రాత్రంతా తిప్పుతారా..? అని ప్రశ్నించారు. ప్రజాపాలనలో ప్రశ్నిస్తే కేసులు పెడతారా..? అని మండి పడ్డారు. సమస్యలపై నిలదీ స్తే నిర్బంధాలా, బడిపిల్లలకు బాసటగా నిలిస్తే అరెస్ట్ చేస్తారా..?..పురుగుల అన్నం పెడుతున్నారని ప్రశ్ని స్తే కేసులు పెడ్తారా…అంటూ ఆగ్రహం వ్యక్తం చేశా రు. గురుకుల సమస్యలపై, విద్యార్థుల ఆత్మహత్య లు, పిల్లల మరణాలపై గళమెత్తితే గొంతు నొక్కుతారా..? అని ప్రశ్నించారు.

పండుగలు మీకు…పస్తులు రైతులకు : కెటిఆర్
రైతు పండుగలా..?…పండుగలు మీకు…పస్తులు రైతులకు అంటూ బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. చెప్పింది బారాణ…-చేసింది చారాణ అని మండిపడ్డారు. కల్లాల్లో ధాన్యం పోసి..కళ్లల్లో వత్తులు వేసుకొని కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్న రైతులు..నిబంధనల పేరుతో కొర్రీలు పెట్టి కొనుగోళ్లు చేపట్టకపోవడంతో అడ్డికి పావుశేరు లెక్కన దళారులకు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అబద్దానికి అంగీ, లాగు తొడిగితే అది కాంగ్రెస్ సర్కార్ అని విమర్శించారు. దేనికి విజయోత్సవాలు..? రైతును నిండా ముంచినందుకా..?..వ్యవసాయాన్ని ఆగం చేసినందుకా..? అని ప్రశ్నించారు. రైతుభరోసాకు ఎగనామం పెట్టి-రుణమాఫీ పేరుతో పంగనామాలు పెట్టి..పంటల కొనుగోళ్లకు శఠగోపం పెట్టి- ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ ఎగ్గొట్టి..దిలావర్‌పూర్‌లో దమనకాండ సృష్టించి.. -రామన్నపేటను రావణకాష్టం చేసి-.. లగచర్ల రైతులను జైలుపాలు చేసి.. అల్లుడి కళ్ళలో ఆనందం చూసినందుకా..? అని నిలదీశారు. సిగ్గు లేదా జీడిగింజా అంటే-నల్లగున్న నాకేం సిగ్గు అన్నదంట అంటూ సెటైర్లు చేశారు. నీ గుడ్డిగుర్తులు, కాకిలెక్కలు, కల్లబొల్లి కబుర్లతో ఎల్లకాలం కాలం వెళ్లదీయలేవు..జాగో తెలంగాణ జాగో అంటూ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News