Monday, January 27, 2025

రైతుకు బోనస్ ఎగవేస్తే ఊరుకోం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / సిరిసిల్ల ప్రతినిధి : రైతులకు కాంగ్రెస్ ప్రకటించిన రూ 500 బోనస్ చెల్లించే వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద గులాబీ, ఆకుపచ్చ కండువాలు ధరించి బిఆర్‌ఎస్ శ్రేణులు నిరంతరం ఆందోళనలు చేస్తాయని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సిరిసిల్ల తెలంగాణ భవన్‌లో శనివారం నిర్వహించిన రైతు దీక్షలో ఆయన మాట్లాడుతూ.. రైతు లు ఆందోళనలో ఉంటే.. మాజీ సిఎం కెసిఆర్ 75 ఏండ్ల వయస్సులో ఎర్రటి ఎండల్లో రైతుల వద్దకు వెళుతుంటే.. సిఎం రేవంత్ రెడ్డి మాత్రం రైతులను పరామర్శించకుండా క్రికెట్ మ్యాచ్‌లు చూసి ఆనందిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల కోడ్ పేరిట రైతులకు బోనస్ ఎగవేతకు ప్రభుత్వం ప్రయత్నిస్తే ఊరుకోమని, అవసరమైతే అధికారులు ధాన్యం విక్రయించిన రైతుల వివరాలు రాసుకుని ఎన్నికల కోడ్ పూర్తయిన తరువాత రైతుల ఖాతాల్లోకి బోనస్ డబ్బులు పడేలా చూడాలన్నారు. నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయి, గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోందన్నారు.

వంద రోజుల్లో అమలు చేస్తామన్న రైతు భరోసా కింద ఇస్తానన్న రూ15 వేలు ఎప్పుడు రైతుల ఖాతాల్లో వేస్తారని ప్ర శ్నించారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా అందిస్తామన్నారని ఆ మాట నిలుపుకోవాలన్నారు. రెండు లక్షల రుణమాఫీ ఎప్పుడు అమలు చేస్తారన్నారు. రూ. 4 వేలు వృద్ధాప్య పెన్షన్లు ఇంటికిద్దరికి ఇస్తామన్నారని అదెప్పుడు అమలు చేస్తారన్నారు. సిఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసి రైతులకు బోనస్ ఇవ్వాలని, కావాలంటే తాము కూ డా బోనస్ ఇవ్వడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని లేఖ రాస్తామన్నారు. రాష్ట్ర మంత్రులు వర్షాలు పడకపోతే వచ్చిన కరువుకు తామేమి చేస్తామని అంటున్నారని, అయితే ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువని నొక్కి మరీ సవివరంగా చెప్పారు. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం కంటే 14 శాతం అధికంగా వర్షపాతం నమోదైందని అన్నారు. మంత్రి శ్రీధర్‌బాబే అధిక వర్షాల వల్ల పంటలు నష్టపోయిన వారికి పరిహారం ఇవ్వాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు.

సుభిక్షంగా ఉన్న రాష్ట్రాన్ని, రైతు బంధు కో సం ఉంచిన 7000 కోట్ల రూపాయల ఖజానాను కాంగ్రెస్ ప్రభుత్వానికి అం దిస్తే రైతులకు మొండిచెయ్యి చూపారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 300 పిల్లర్లు ఉంటే అందులో రెండు పిల్లర్ల క్రింద ఇసుక తొలగిపోయి కుంగితే వాటిని రెండు నెలల్లో రిపేర్ చేసి నీటిని రైతులకు అందించే అవకాశాలున్నా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కెసిఆర్‌ను బద్‌నామ్ చేయాలని రిపేర్ చేయలేదన్నారు. 50 టిఎంసిల నీరు నిలువ చేసే అవకాశాలున్నా నిర్లక్షం చేశారన్నా రు. ఈ కార్యక్రమంలో నాప్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళచక్రపాణి, టెక్స్‌టైల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు జిందం చక్రపాణి తదితరులు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News