Sunday, January 12, 2025

అదానీ-రేవంత్ బంధాన్ని బయటపెడతాం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ కడుతున్నారని ఫైరయ్యారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సిఎం రేవంత్, అదానీ దోస్తానా అంటూ ముద్రించిన టీషర్ట్స్ ధరించి బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు రావడంతో అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీ లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.

ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ.. నడిరోడ్డుపైనే ఎమ్మెల్యేలను అడ్డుకోవడం సమంజసమా? అంటూ ప్రశ్నించారు. పార్లమెంటుకు రాహుల్‌, కాంగ్రెస్‌ ఎంపీలు టీషర్టు ధరించి వెళ్లారన్నారని.. కానీ, మమ్మల్నీ పోలీసులను అడ్డం పెట్టుకుని సభకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీకి కాంగ్రెస్‌ నేతలు దాసోహం అంటున్నారని విమర్శించారు. అదానీతో రేవంత్‌ అక్రమ సంబంధాన్ని బయటపెడతామని కెటిఆర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News