- Advertisement -
అదానీ విషయంలోనే కాదు, డా. బాబాసాహెబ్ అంబేద్కర్‌పై కూడా కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి కొనసాగిస్తుందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. బాబాసాహెబ్ అంబేద్కర్‌పై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిపైన కెటిఅర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఢిల్లీలో రాజకీయ లాభం కోసం అంబేద్కర్‌పై కపట ప్రేమ చూపిస్తారు.. కానీ, హైదరాబాద్‌లో మాత్రం 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రజలు చూసేందుకు అనుమతించకుండా అవమానిస్తారని మండిపడ్డారు. బాబాసాహెబ్‌ను జయంతి, వర్ధంతి సందర్భాలలోనూ అంబేద్కర్‌ను గౌరవించడంలో అగౌరవ పరిచింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని పేర్కొన్నారు.
- Advertisement -