Sunday, January 5, 2025

కాంగ్రెస్ కుట్రలను నిలదీద్దాం

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో కొనసాగుతున్న నిరంకుశ
పాలనపై పోరాటం కొనసాగిద్దాం-
గత సంవత్సరమంతా ప్రజల పక్షాన
నిలిచాము పార్టీ శ్రేణుల పోరాటం
వల్లనే పాలకపక్షం అవినీతిని,
అరాచకాన్ని అడ్డుకోగలిగాము
కొత్త సంవత్సరం సందర్భంగా పార్టీ
శ్రేణులకు కెటిఆర్ ప్రత్యేక సందేశం
మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ తుగ్లక్ విధానాల పైన, నిరంకుశ పాలన పైన, హామీలను ఎగవేసిన మోసపూరిత ప్రభుత్వ తీరుపైన మన పోరాటం కొనసాగిద్దామని భారత రాష్ట్ర సమితి శ్రేణులకు పార్టీ వర్కిం గ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. పోయిన ఏడాది పాటు కాంగ్రెస్ పార్టీ పరిపాలన వైఫల్యాలను ఎండగట్టిన పార్టీ శ్రేణులకు కొత్త సంవత్సరం సందర్భంగా కెటిఆర్ ప్రత్యేక సందేశం ఇచ్చారు. ప్రాణ సమానులైన… మ న బిఆర్‌ఎస్ తోబుట్టువుల్లారా.. అంటూ ప్రా రంభించిన కెటిఆర్, గత ఏడాది పాట చేసిన పోరాటాల ను నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తూనే రానున్న రో జుల్లోనూ కాంగ్రెస్ మోసపూరిత ప్రభుత్వాన్ని గద్దెధించేదాకా పో రాటం సాగిద్దామని పిలుపునిచ్చారు. గత ఏడాది కాలం గా ఈ కాంగ్రెస్ నిరంకుశ పాలనపై గులాబీ సైనికులందరూ కనబరిచిన పోరాట స్ఫూర్తికి పేరుపేరునా ప్రతి ఒక్కరికి శిరస్సువంచి సలాం చేస్తున్నా అని పేర్కొన్నారు. గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా..

క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు కనబరిచిన కదనోత్సాహం.. రాష్ట్ర స్థాయి లో పని చేసే నాయకత్వంలో కూడా మాటలకందని స్థా యిలో కొండంత స్ఫూర్తి నింపిందన్నారు.తెలంగాణ గ్రామ గ్రామాన ఉన్న.. గులాబీ సైనికులు రాష్ట్ర ప్రజలపక్షాన.. విరామం ఎరుగని పోరాటం చేస్తున్నారనీ, అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చిన ఈ తుగ్లక్ పా లన వల్ల కష్టకాలంలో ఉన్న అన్ని వర్గాల పక్షాన అలుపులేని పోరాటం చేశారని అభినందించారు. ఏడాది కాలం లో పార్టీ శ్రేణులు రైతుల పక్షాన పోరాడారని, నేతన్నల గొంతుకై నిలిచారని పేర్కొన్నారు. మహిళా సమస్యలపై గర్జించారు, బడుగు బలహీనవర్గాల ప్రజల గళమయ్యా రు, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీల పక్షాన సమరభేరి మోగించారు.. నిరుద్యోగుల హక్కుల కోసం కాంగ్రెస్ సర్కారు ను నిలదీశారు.. ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీల గారడీని ప్రజాక్షేత్రంలో ఎండగట్టారని పేర్కొన్నారు.

గల్లీ నుంచి ఢిల్లీ దాకా అవినీతిని ఎండగట్టాము
మూసీలో మూటలవేట నుంచి లగచర్ల లడాయి వర కూ.. అన్యాయం జరిగిన ప్రతిచోటా బాధితుల పక్షాన మీరు కొట్లాడారనీ, తెలంగాణ ప్రజల గుండెచప్పుడును అడుగుడుగునా మీరు ప్రతిధ్వనింపజేశారని బిఆర్‌ఎస్ శ్రేణులను ఉద్దేశిస్తూ కెటిఆర్ వ్యాఖ్యానించారు. తెలంగా ణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు పార్టీ చేసిన పోరాటాలు.. చరిత్రపై చెరగని సంతకాలుగా నిలుస్తాయని పే ర్కొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యల ను, అత్యంత సమర్థంగా తిప్పికొట్టిన సందర్భాలు.. ఈ పోరాటపథంలో నిలిచి ఉండే మైలురాళ్లు మారాయి అని తెలిపారు. తెలంగాణ ప్రజల కోసం గల్లీ నుంచి ఢిల్లీ దా కా..అసమర్థ, అనాలోచిత కాంగ్రెస్ విధానాలపై..బిఆర్‌ఎస్ శ్రేణులు మోగించిన జంగ్ సైరన్ ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టించిందని అన్నారు. భారత రాష్ట్ర స మితి చేసిన అలుపెరగని పోరాటాల వల్లే..అదానీ ఆశజూపిన రూ.100 కోట్లను
ప్రభుత్వం వెనక్కి ఇవ్వాల్సి వచ్చిందని కెటిఆర్ గుర్తు చేశారు.

లగచర్ల లడాయి.. యావత్ దేశం ముందు నియంతృత్వ కాంగ్రెస్‌ను దోషిగా నిలబెట్టిందన్నారు. ఏడాదికాలంగా ప్రభుత్వాన్ని నిలదీసే క్రమంలో నియంతృత్వ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అక్రమ కేసులు పెట్టినా.. ప్రభుత్వం ఎంత వేధించాలని చూసినా..మొక్కవోని ధైర్యంతో పార్టీ శ్రేణులు నిలబడ్డ తీరు అపూర్వం, అసాధారణం, చారిత్రాత్మకం అని వ్యాఖ్యానించారు. దశాబ్దాలపాటు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను, కుక్కలు చింపిన విస్తరిలా మార్చే కాంగ్రెస్ కుట్రలను,అడుగడుగునా ప్రశ్నిద్దాం, నిలదీద్దామని పిలుపునిచ్చారు. మన పార్టీకి పునాది రాళ్లు, బిఆర్‌ఎస్‌కు మూలస్తంభాలు పార్టీ శ్రేణులు అని, మన గులాబీ జెండాకు.. వెన్నుముక మీరే అని బిఆర్‌ఎస్ శ్రేణులను ఉద్దేశిస్తూ పేర్కొన్నారు. పార్టీ తరఫున నిలబడి.. కలబడే.. నేటి అలుపెరగని పోరాట యోధులే.. రేపటి తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై బిఆర్‌ఎస్ పక్షాన మెరిసే.. వజ్రాయుధాలు మారుతారని ఆకాంక్షించారు. ఏడాది పాటు అద్భుతమైన పోరాట కటిమ చూపిన గులాబీ సైనికులందరికీ… గుండెల నిండా… మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News