కాంగ్రెస్ పాలనలో ఇది తెలంగాణ
ప్రజలకు దక్కిన అదృష్టం స్వతంత్ర
భారత చరిత్రలో కనీవినీ ఎరుగని వ్యవస్థ
ఎక్స్ వేదికగా బిఆర్‌ఎస్ వర్కింగ్
ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యంగ్యాస్త్రాలు
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో ఒ క ముఖ్యమంత్రిని ఎన్నుకుంటే.. ఇంకో అర డజ న్ మంది ఫ్రీగా వచ్చారని, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టం అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కెటిఆర్ పేర్కొన్నారు. 1+6 ఆఫర్ సీఎం వ్యవస్థని స్వతంత్ర భారత చరిత్రలో ఎప్పడు చూడలేదె మో అని కెటిఆర్ ఎక్స్ వేదికగా సెటైర్లు వేశారు. వికారాబాద్ సిఎం తిరుపతి రెడ్డికి ఇవే నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని విమర్శించారు. ప్రజా పాలన కాబట్టి ప్రజలకి మీ అనుముల సి ఎంలలో ఎవరు కావాలో ఎంచుకునే అవకాశం ఇవ్వాలని కోరుకుంటునని అన్నారు. సిఎం ఎం పిక కోసం ఐవీఆర్‌ఎస్ పద్ధతి పెడితే బాగుంటుందేమో చూడండి అని రేవంత్ రెడ్డికి ఒక చిన్న వి న్నపం చేస్తున్నట్లు కెటిఆర్ సూచించారు.
కెసిఆర్‌తో కెటిఆర్ భేటీ
ఫార్ము లా- ఈ కార్ రేస్ కేసు నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌ను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ భేటీ అయ్యారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో శు క్రవా రం కెటిఆర్‌తోపాటు మాజీ మంత్రి హరీష్‌రావు, బిఆర్‌ఎస్ నేతలు బాల్క సుమన్, పాడి కౌ శిక్ రెడ్డిలు కెసిఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గురువారం జరిగిన ఎసిబి విచారణ కు సంబంధించిన పలు అంశాలను కెసిఆర్ దృ ష్టి కి కెసిఆర్ తీసుకువెళ్లారు. ఎసిబి విచారణలో అ ధికారులు అడిగిన ప్రశ్నలు, తాను చెప్పిన సమాధానాలను వివరించారు. అలాగే ఈనెల 16వ తేదీన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్(ఇడి) విచారణకు హాజరుకావాల్సి ఉందని కెసిఆర్‌కు కెటిఆర్ తెలిపారు. దీంతో ఈనెల 16న ఇడి విచారణను ఎలా ఎదుర్కొవాలనే అంశంపై కెటిఆర్‌కు అధినేత దిశానిర్దేశం చేశారు. దాదాపు గంటన్నరపాటు జరిగిన సమావేశంలో తెలంగాణ తాజా రాజకీయ పరిణామాలు, కేసులతోపాటు పార్టీ పరంగా తీసుకోవాల్సిన అంశాలపైనా నేతలకు కెసిఆర్ సూచనలు చేశారు.